చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశ్లీల ఫొటోలు: లేడీ టీచర్ ఆత్మహత్యకు ఇవీ కారణాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రేమోన్మాది కక్షపూరితమైన చర్యనే కాకుండా పోలీసుల నిర్లక్ష్యం కూడా తమిళనాడులోని మహిళా టీచర్ వినుప్రియ ఆత్మహత్యకు కారణంగా తేలింది. తనను ప్రేమించాలని వెంటపడుతూ వచ్చినవాడు ఆమె చావుకు ఒక కారణం కాగా, ఆమె తండ్రి నుంచి సెల్‌ఫోన్ లంచంగా తీసుకుని కూడా తగిన చర్యలు చేపట్టని హెడ్ కానిస్టేబుల్ మరో కారణమని విచారణలో తేలింది.

తమిళనాడులోని సేలం జిల్లా కల్‌పారాపట్టికి చెదిన సురేష్ తనను ప్రేమించాలంటూ వినుప్రియ వెంట పడుతూ వచ్చాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ ఆమె తల్లిదండ్రులు అతన్ని హెచ్చరించారు. దాంతో అతను కక్ష పెంచుకుని, ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వినుప్రియ తండ్రి నుంచి సెల్‌ఫోన్ లంచంగా తీసుకున్న హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

ఫేస్‌బుక్ అశ్లీల ఫొటోల పోస్ట్: లేడీ టీచర్ ఆత్మహత్యఫేస్‌బుక్ అశ్లీల ఫొటోల పోస్ట్: లేడీ టీచర్ ఆత్మహత్య

సేలం జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కూతురు వినుప్రియ (20) బిఎస్సీ పాసై ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే, ఈ నెల 17వ తేదీన మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోలు అశ్లీలంగా ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. దాంతో ఆమె బోరున విలిపించింది.

 Reasons for the suicide of Lady teacher in Tamil Nadu

తండ్రి అన్నాదురై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. ఐడిని బ్లాక్ చేసే సర్వర్ విదేశాల్లో ఉంటుందని, ఇందుకు 20 రోజులు పడుతుందని అక్కడ ఆయనకు సమాధానం వచ్చినట్లు సమాచారం. అన్నాదురై అక్కడి నుంచి సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలని అక్కడ హెడ్ కానిస్టేబుల్ సురేష్ బేరమాడాడు. అన్నాదురై సెల్ ‌ఫోన్ కొనిచ్చాడు. అయినా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇదంతా జరుగుతుండగానే ఈ నెల 26వతేదీ మరోసారి వినుప్రియ అశ్లీల ఫొటోలు ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల వద్దకు వెళ్లారు. అయితే, అవమానాన్ని భరించలేక 26వ తేదీననే వినుప్రియ ఆత్మహత్య చేసుకుంది.

అయితే, ఫేస్‌బుక్ ఐడిని బ్లాక్ చేయడానికి 20 రోజులు పడుతుందని చెప్పిన పోలీసులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకున్న గంటల్లోనే ఐడిని బ్లాక్ చేశారు. ఫిర్యాదు అందగానే చర్యలు తీసుకుని ఉంటే వినుప్రియ బతికి ఉండేదని అంటున్నారు.

English summary
Police have neglected to act on Vinupriya's parents complaints on morphing images uploaded in Facebook in Salem district of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X