వ్యాక్సిన్ల కోసం బెదిరింపులు, ఎన్నికలు ,కుంభమేళాపై మాట్లాడను : సీరం సిఈఓ అదర్ పూనవల్లా షాకింగ్ కామెంట్స్
ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనవల్లా భారతదేశంలో తనకు వచ్చిన బెదిరింపులపై, కరోనా వ్యాధి కారణాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.తమ సంస్థ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను త్వరగా పంపిణీ చేయాలని కోరుతూ రాజకీయ నాయకులు మరియు "శక్తివంతమైన వ్యక్తుల" నుండి బెదిరింపులను ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.లండన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పూనవల్లా వ్యాక్సిన్ ల ఉత్పత్తి విషయంలో తాను భయంకరమైన ట్రోల్స్ కు గురయ్యానని చెప్పారు. ఇదే సమయంలో భారత్ కరోనా స్థితి, ఎన్నికలు , కుంభమేళాపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు .
Recommended Video

వ్యాక్సిన్ ల కోసం తనను బెదిరించారు : అదర్ పూనవల్లా
వ్యాక్సిన్ ల కోసం తనను బెదిరించారని పూనవల్లా టైమ్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,వ్యాపార సంస్థల అధిపతులు మరియు ఇతర ప్రముఖుల నుండి , భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల నుండి తనకు కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు.దేశంలో కరోనా మహమ్మారి దూకుడు స్థాయి చాలా ఎక్కువగా ఉందని,ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు టీకా పొందాలని భావిస్తారని ఆయన పేర్కొన్నారు. మీరు మాకు వ్యాక్సిన్ ఇవ్వకపోతే అది మంచిది కాదని వారు బెదిరించారని , తాను పాటించకపోతే వారు ఏమి చేయవచ్చో ఇది సూచిస్తుందన్నారు.

ఇండియాలో సమస్యను ఫేస్ చేశానని చెప్పిన పూనవల్లా
పూనవల్లా గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో లండన్‌లో ఉన్నారు. ఎనిమిది రోజుల క్రితం బ్రిటన్ భారతదేశం నుండి ప్రయాణికులను నిషేధించడానికి ముందు ఆయన తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో లండన్ వెళ్ళాడని తెలుస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆయన కొత్త టీకా ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించినట్లు సూచించారు. పూనవల్లా టైమ్స్‌తో మాట్లాడుతూ తాను యుకెలో ఎక్కువ కాలం ఉంటాను, ఎందుకంటే తాను భారతదేశంలో సమస్యను ఫేస్ చేసిన పరిస్థితికి తిరిగి వెళ్లడం ఇష్టం లేదన్నారు. అక్కడ ప్రతిదీ నా భుజాలపై పడుతుందని తాను ఒంటరిగా ఫేస్ చేయలేను అంటూ వ్యాఖ్యానించారు.

భారత్ కరోనా పరిస్థితిపై అదర్ పూనవల్లా షాకింగ్ కామెంట్స్
సీరం సీఈఓ ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశారు. యు.కె.లోని మా భాగస్వాములు మరియు వాటాదారులందరితో ఒక అద్భుతమైన సమావేశం జరిగింది. ఇంతలో, పూణేలో కోవిషీల్డ్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉందని పేర్కొనడం ఆనందంగా ఉంది. నేను తిరిగి వచ్చిన తరువాత కొద్ది రోజుల్లో కార్యకలాపాలను సమీక్షిస్తాను అంటూ ట్వీట్ చేసారు. భారతదేశం ప్రస్తుతం ఉన్న కరోనా దారుణ పరిస్థితికి ఎవరు కారణమని అడిగినప్పుడు, పూనవల్లా ఇలా అన్నారు. తాను సరైన సమాధానం ఇస్తే, తన తల తీసేస్తారు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఎన్నికలు, కుంభమేళాపై తాను మాట్లాడనన్న పూనవల్లా
ఇదే సమయంలో తాను ఎన్నికలు లేదా కుంభమేళా గురించి వ్యాఖ్యానించలేను. ఇది చాలా సున్నితమైన అంశం, దేవుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఊహించిఉండడు అంటూ వ్యాఖ్యానించారు. సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో తండ్రి మరియు పూనవల్లా గ్రూప్ ఛైర్మన్ సైరస్ పూనవల్లా అదర్ పని కారణంగా మరియు అవసరమైనప్పుడు వివిధ ప్రదేశాలకు వెళతాడు, అయితే ఈసారి అతని కుటుంబాన్ని తనతో తీసుకువెళ్ళాడు అంటూ వ్యాఖ్యానించారు. ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది .ఇప్పటివరకు భారతీయ పౌరులకు ఇచ్చిన టీకా మోతాదులలో 90 శాతం సరఫరా చేసింది. అయితే, గత కొన్ని వారాలుగా, దేశంలో వ్యాక్సిన్లు కొరత ఉన్నాయి.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications