గుజరాత్ అల్లర్లపై మన్ కీ బాత్‌లో మోడీ ఆవేదన

న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్‌లో జరిగిన సంఘటనలు భారత దేశాన్ని కలచివేశాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉదయం మన్ కీ బాత్‌లో ఆయన ప్రసంగించారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం యువ సంచలనం హార్దీక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ పటేల్ సామాజిక వర్గం కొనసాగించిన ఆందోళనపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు బాధాకరమని మోడీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో పెచ్చరిల్లిన అల్లర్లు యావత్ దేశాన్ని బాధించాయన్నారు. అయితే విజ్ఞులైన గుజరాతీలు తక్షణమే స్పందించడంతో పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చిందన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ నడియాడిన నేలలో ఇలా హింస జరగడం అత్యంత బాధాకరమన్నారు. అల్లర్లు సద్దుమణిగిన తర్వాత గుజరాత్‌లో శాంతి వెల్లివిరిసిందన్నారు. గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోడీ పలు అంశాలపై మాట్లాడారు.

Recent Events in Gujarat Have Pained the Nation, Says PM Modi in Mann ki Baat

ప్రజలందరూ జన్‌ధన్‌ యోజనను విజయవంతం చేశారని, జన్‌ధన్‌ యోజన్‌కు ఏడాది పూర్తయ్యిందన్నారు. జన్‌ధన్‌ యోజనలో 17.74 కోట్ల మంది ఖాతాలు తెరచి, రూ.22వేల కోట్లు జమ చేశారన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధేనన్నారు.

దేశం నుంచి పోలియో, ధనుర్వాతాన్ని తరిమేశామన్నారు. భూసేకరణ చట్టానికి సవరణ అవసరమన్నారు. భూసేకరణ చట్ట సవరణపై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కాలువలు, గ్రామాల విద్యుద్దీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భూసేకరణ చట్టానికి సవరణ అవసమన్నారు.

జై జవాన్‌ జై కిసాన్‌ కేవలం నినాదం కాదని, అది మంత్రం అన్నారు. రైతులకు ప్రయోజనం కల్పించేందుకు సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కిందిస్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు లేకుండా చూస్తామన్నారు. విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచుకోవాల్సి అవసరముందన్నారు. బుద్ధిస్ట్ కాన్ఫరెన్సుకు బోద్ గయా వెళ్లడం సంతోషాన్నిస్తోందన్నారు. 1965 యుద్ధ హీరోలకు తాను నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+