వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్, హిమాచల్ పోల్: భారీగా మద్యం, లిక్కర్ స్వాధీనం: ఈసీ

|
Google Oneindia TeluguNews

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక జరగబోతుంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. దీంతోపాటు క్యాంపెయిన్ కూడా జోరుగా చేస్తోంది. ప్రలోభాల పర్వం కూడా భారీగానే ఉంది. దీంతో రికార్డు స్థాయిలో నగదు పట్టుబడుతుంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘమే తెలియజేసింది.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నిక శనివారం జరగనుండగా, గుజరాత్ ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 1వ తేదీన జరగనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో నిన్నటి ప్రచార పర్వం ముగిసింది. ఎల్లుండి ఎన్నిక జరగనుండగా భారీగా నగదు పట్టుబడింది. 2017తో పోలిస్తే అదీ 5 రెట్లుగా ఉందని ఈసీ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్దీ రోజుల్లోనే గుజరాత్‌లో 71.88 కోట్ల నగదు పట్టుబడింది. 2017లో మాత్రం మొత్తం 27.21 కోట్ల నగదు పట్టుబడింది. హిమాచల్ ప్రదేశ్ కూడా 50.28 కోట్లు పట్టుబడగా.. 2017లో కేవలం 9.03 కోట్లు సీజ్ చేశారు.

 Record cash, liquor seized as Himachal Pradesh, Gujarat assembly elections

రూ.64 కోట్ల విలువ గల వస్తువులు, ఇతర సామాగ్రి కూడా పట్టుబడిందని తెలిపారు. అవీ ముంద్రా పోర్ట్ నుంచి తీసుకు వస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. రూ.17.18 కోట్ల నగదు, 17.5 కోట్ల విలువ గల మద్యం, 1.2 కోట్ల విలువ గల డ్రగ్స్, రూ.41 లక్షల విలువ గల వస్తువులను హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 10వ తేదీ వరకు సీజ్ చేశారు. రూ.66 లక్షల నగదు, రూ.3.86 కోట్ల మద్యం, రూ.94 లక్షల డ్రగ్స్, ఉచితాలు రూ.64.56 కోట్లను గుజరాత్‌లో గురువారం వరకు సీజ్ చేశారు.

ఇటీవల జరిగిన బై పోల్‌‌లో కూడా 9.35 కోట్ల నగదు సీజ్ చేశారు. అందులో సింహాభాగం తెలంగాణలో గల మునుగోడులో రూ.6.6 కోట్ల నగదు, వేలాది లీటర్ల మద్యం, రూ.1.78 కోట్ల వస్తువులను సీజ్ చేశారు.

English summary
Record seizures" of cash, liquor and freebies have been made ahead of the Gujarat and Himachal Pradesh Assembly polls, Election Commission said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X