నేనూ నాన్నను కోల్పోయా- ఆ బాధ తెలిసినవాడిని: విమాన ప్రమాదంలో అదే కీలకం: కింజరాపు ఎమోషనల్
Air India flight Crash: ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
దేశ రాజధానిలో ఈ ఉదయం ఈ కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దీనికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గుజరాత్ ప్రభుత్వం, డీజీసీఏ అందించిన నివేదికలపై చర్చించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. విమానం కూలిపోయిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత బాధాకరమో తనకు బాగా తెలుసునని, రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయానని గుర్తు చేసుకున్నారు.
విమానం కూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్ కు గురయ్యానని, అప్పటికప్పుడు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లానని చెప్పారు. అప్పటికే గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని, ప్రతి కుటుంబానికీ న్యాయం చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
విమాన శిథిలాల నుండి బ్లాక్ బాక్స్‌ను వెలికితీయడం.. దర్యాప్తు ప్రక్రియకు అత్యం కీలకమని ఆయన అన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెంటనే రంగంలోకి దిగిందని, శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అనంతరం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడారు. విమానం కూలిపోయిందనే సమాచారం జూన్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అందిందని, వెంటనే అహ్మదాబాద్ ఏటీసీని సంప్రదించి పూర్తి సమాచారాన్ని సేకరించామని తెలిపారు.
ఈ విమానం మధ్యాహ్నం 1:39 నిమిషాలకు టేకాఫ్ తీసుకుందని, కొన్ని సెకన్లలో దాదాపు 650 అడుగుల ఎత్తుకు చేరుకుందని వివరించారు. ఆ తర్వాత, అది కిందికి జారడం మొదలుపెట్టిందని, ఆ వెంటనే పైలెట్ అహ్మదాబాద్ ఏటీసీకి మే డే కాల్ చేశారని వివరించారు.
విమానంతో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించగా ఎటువంటి స్పందన రాలేదని, సరిగ్గా ఒక నిమిషం తర్వాత, ఈ విమానం ఎయిర్ పోర్ట్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మేధానినగర్‌లో కూలిపోయిందని సమీర్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. ఫ్లైట్ కేప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ సుందర్.. అంతకుముందు పారిస్-ఢిల్లీ-అహ్మదాబాద్ ఫ్లైట్ ను నడిపినట్లు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications