వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్ టాక్ యాప్ ద్వారా రిక్రూట్‌మెంట్.!టార్గెట్ క్రిస్మస్.!భారీ విద్వంసానికి ఐసిస్ కుట్ర.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ఐసీస్) భారీ విధ్వంసానికి వ్యూహరచన చేస్తోంది. అందుకోసం పెద్దయువతకు గాలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. యువతను నియమించుకునే క్రమంలో ఎవరికీ అనుమానం తలెత్తకుండా ఉండేందకు టిక్ టాక్ యాప్ ను వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది ఐసిస్ ఉగ్రవాద సంస్థ. టిక్ టాక్ యాప్ ద్వారా యువతను ఆహ్వనించి తర్వాత వారిని ఐసిస్ కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చదిద్దుకొని వారి ద్వారా విధ్వంసం చేయించాలనేది ఐఎస్ఐఎస్ వ్యూహంగా తెలుస్తోంది.

రిక్రూట్‌మెంట్ లో ఐసిస్ ఉగ్ర సంస్థ కొత్త విధానాలు.. సోషల్ మీడియా వేదికగా అమాయకులకు ఎర

రిక్రూట్‌మెంట్ లో ఐసిస్ ఉగ్ర సంస్థ కొత్త విధానాలు.. సోషల్ మీడియా వేదికగా అమాయకులకు ఎర

అంతే కాకుండా టిక్ టాక్ యాప్ ద్వారా యువతను రిక్రూట్‌మెంట్ చేసుకుని తర్వాత వారిని సూసైడ్ బాంబర్స్ గా శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత ఆత్మాహుతి దాడులకు ఉపక్రమించాలన్నది ఐఎస్ఐఎస్ కుట్ర తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన టిక్ టాక్ సాయంతో ఐఎస్ఐఎస్ సంస్థ రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడులకు ఉగ్రసంస్థ పెద్ద ఎత్తున ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. నిరుద్యోగం లాంటి సమస్యలతో, ఇతర మతాలపై రగిలిపోయే కొందరు ఈ ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు. ఇదే అదనుగా భావించి ఉగ్ర సంస్థలు టెక్నాలజీ సాయంతో అమాయకులును తమ వైపు తిప్పుకుంటోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆన్‌లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుందని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

టిక్ టాక్ యాప్ ద్వారా వల.. తర్వాత ఆత్మాహుతి దాడులకు ఉసిగొల్పనున్న ఐఎస్ఐఎస్

టిక్ టాక్ యాప్ ద్వారా వల.. తర్వాత ఆత్మాహుతి దాడులకు ఉసిగొల్పనున్న ఐఎస్ఐఎస్

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన టిక్ టాక్ సాయంతో ఐఎస్ఐఎస్ సంస్థ రిక్రూట్ చేసుకున్నట్లు గుర్తించారు. టిక్ టాక్ యాప్ లో వీడియోలు చేసి వాటి ద్వారా యువకులను తమ వైపు తిప్పుకునేందుకు ఉగ్రసంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిమేతరులపై ద్వేషం, ఈర్ష్య, అసూయ ఉండే యువకులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ఎస్ టిక్ టాక్ ద్వారా నియామకాలు చేపట్టి ఉగ్రసంస్థలో శిక్షణ ఇస్తున్నట్టు మీడియా కథనాలు వినిపస్తున్నాయి. ఓ జాతీయ ప్రసార మాద్యమంలో దీనిపై వచ్చిన కథనం ప్రకారం ఐఎస్ఎస్ డజన్ల కొద్ది టిక్ టాక్ ఖాతాలను తెరిచినట్టు, క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ సమయంలో ఉగ్రదాడులకు ఐఎస్ఎస్ పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.

క్రిస్మస్ టార్గెట్‌గా దాడులు. యువతకు ఆత్మహుతి బాంబర్స్ గా శిక్షణ

క్రిస్మస్ టార్గెట్‌గా దాడులు. యువతకు ఆత్మహుతి బాంబర్స్ గా శిక్షణ

ఉగ్రవాద సంస్థలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ సమయంలో ఆత్మాహుతి దాడులు చేసి భారీ విధ్వంసాకి పాల్పడాలనే కుట్రలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి ఐఎస్ఎస్ తమ గ్రూపులలో పోస్ట్ చేసింది. పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ సమయంలో భారీ సమూహాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లో క్రిస్మస్ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయని, కొన్ని నెలల ముందుగానే ఉగ్రవాదులు అమాయకులైన యువతను ప్రలోభపెట్టి రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అల్లాపై నమ్మకం లేని వారిని భయపెట్టాలని, ఆ బానిసలకు శిక్ష విధించాలంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ సంబరాలను ఆ వీడియోలలో చూపించారు. వీరులారా సిద్ధంగా ఉండండి. అల్లా సేవకులు ఇందుకు వెనుకాడరంటూ ప్రచారం సాగిస్తున్నారు ఉగ్రవాదులు. అంటే క్రిస్మస్ టైమ్ లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్లాన్ చేసినట్లు ఓ జాతీయ మీడియా కధనాలు వెల్లడించింది.

గతంలో పైశాచిక దాడులు.. వేలాది మందిని చంపేసిన ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ

గతంలో పైశాచిక దాడులు.. వేలాది మందిని చంపేసిన ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ

గత పద్దెనిమిది నెలలుగా ఆ సోషల్ మీడియా టిక్ టాక్ అకౌంట్ ను రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఖాతాల్లోనూ ఈ తరహా వీడియోలతో సూసైడ్ బాంబర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లివర్ పూల్ లో కారు బాంబు దాడితో యూకేలో అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 17న ఇటలీలోని మిలాన్ పోలీసులు 19 ఏళ్ల యువతిని ఉగ్రదాడులకు కుట్ర ఆరోపణలతో అరెస్ట్ చేశారు. కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో దాదాపు రెండు వందల అమాయకులు మరణించడం ఇలాంటి ఘటనలకు నిదర్శనం. 2019లో ఈస్టర్ సందర్భంగా ఐఎస్ఐఎస్ శ్రీలంకలో వరుస బాంబు దాడులకు పాల్పడింది. వందలాది మంది దుర్మరణం చెందగా, వేలాది మంది గాయపడ్డారు. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో శ్రీలంకలో బాంబు దాడులు జరగిన విషయం తెలిసిందే.

English summary
ISIS was found to have been recruited with the help of popular social media medium Tik Tak. The militant group is trying to woo young people by making videos on the Tik Tak app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X