ఇంకా 86% కరెన్సీ మారాల్సి ఉంది: అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఇంకా 86 శాతం కరెన్సీ మారాల్సి ఉదని కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పాత నోట్లు డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉందని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. అతి పెద్ద నగదు స్వచ్ఛతా కార్యక్రమం నడుస్తోందని ఆయన చెప్పారు.
రూ.2000 నోట్లు పట్టే విధంగా ఎటిఎంలను మారుస్తున్నామని, దానికి ఇంకా రెండు వారాల సమయం పడుతుందని ఆయన చెప్పారు. రూ. 500, 1000 నోట్ల రద్దు వల్ల సామాన్య మానవుడికి ఎదరువుతున్న ఇబ్బందులకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆన చెప్పారు.

రెండు వారాల్లోగా ఎటిఎంల్లో పరిస్థితి యధాస్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. నగదు బదిలీలను ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నట్లు, బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు డేటా తీసుకుంటున్నట్లు ఆయన యెప్పారు. ఇటువంటి సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కాబోవని అన్నారు
వ్యాపారాల్లో పారదర్శకత రావాలని, ఈ బ్యాంకింగ్ విధానం పెరగాలని ఆయన చెప్పారు. ఉప్పు కొరత ఉందనే పుకార్లను ఆయన ఖండించారు. అటువంటి పుకార్లను ప్రచారంలోకి తెచ్చేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్రించారు.
నిరంతరం బ్యాంకులు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు లభిస్తోందని చెప్పారు బ్యాంకు లావాదేవీల్లో 24 శాతం ఎస్‌బిఐలో జరుగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications