జియో ‘బై వన్ గెట్ వన్’ ఫ్రీ డేటా ఆఫర్.. వారికి కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: గత ఏడాదిగా ఉచిత వాయిస్, ఉచిత డేటా సర్వీసులతో సంచలనం స‌ృష్టిస్తున్న రిలయన్స్ జియో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎన్నో పథకాలు వేస్తోంది.

ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలుచేయనున్న జియో కొత్తగా 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ తో మరో సంచలనానికి తెర తీయబోతోంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం.. రూ.149 రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనపు డేటా ప్రయోజనాలు అందనున్నట్లు సమాచారం.

Reliance Jio

మార్చి 31తో ముగుస్తున్న 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్ గడువు కంటే ముందుగా రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 1జీబీ, 5జీబీ, 10జీబీ డేటా అదనంగా ఇస్తామని రిలయన్స్ జియో ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇదొక్కటే కాకుండా తాజాగా రూ.149కు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ తోపాటుగా మరో 1జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 'ప్రైమ్ మెంబర్ షిప్' తీసుకోని జియో వినియోగదారులకు ఇదే రీఛార్జ్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ లు, 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఒకవేళ 'ప్రైమ్ మెంబర్ షిప్' పొంది ఉంటే.. ఇంతే మొత్తం రీఛార్జ్ కింద 2జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జనవరి నుంచి మార్చి 31 వరకు జియో వినియోగదారులకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ఆఫర్ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కింద రూ.303, రూ.499, రూ.999, రూ.1999, రూ.9999 రీఛార్జ్ లపై అదనపు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం రూ.149 రీఛార్జ్ తో కూడా డేటా ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Reliance Jio has announced its ‘Buy One Get One’ offer, which gives Jio Prime prepaid users additional free data benefits at recharge of Rs 149, Rs 303 and Rs 499 & above. Jio Prime members will get an automatic benefit of free add-on of 1GB, 5GB and 10GB data respectively if they recharge before March 31.The add-on benefit will only be applicable starting April 1. However, users can go for multiple recharges before March 31 and the free ad-on packs will keep getting added in the consecutive months
Please Wait while comments are loading...