ముఖేశ్ బాటలోనే అనిల్.. రూ. 299కే అన్ లిమిటెడ్ డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్!

అనిల్ అంబానీ సారధ్యంలో కొనసాగుతున్న ఆర్ కామ్ కొత్తగా ఓ వినూత్న ఆఫర్ ను ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక ట్వీట్ ప్రకారం.. రూ. 299 రెంటల్ ప్లాన్ పై లభించే ఈ పథకం కింద అపరిమిత డేటా, కాల్స్, టెక్ట్స్ మెసేజ

న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో చౌక ధరలతో కూడిన ఆకర్షణీయమైన ఆఫర్లతో టెలికాం మార్కెట్ లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆ రంగంలోని ఇతర టెలికాం కంపెనీలు సతమతమవుతూనే ఉన్నాయి.

తమ వినియోగదారులు చేజారకుండా ఉండేందుకు ఈ సంస్థలు నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా తన అన్న దారిలోనే నడవాలని నిర్ణయించుకున్నారు.

Reliance Jio Impact: RCom’s New Rs 299 Plan Offers Unlimited Data, Calls and Texts

అనిల్ సారధ్యంలో కొనసాగుతున్న ఆర్ కామ్ సైతం కొత్తగా ఓ వినూత్న ఆఫర్ ను ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక ట్వీట్ ప్రకారం.. రూ. 299 రెంటల్ ప్లాన్ పై లభించే ఈ పథకం కింద అపరిమిత డేటా, కాల్స్, టెక్ట్స్ మెసేజ్ లు వినియోగించుకోవచ్చు.

అయితే రూ. 299 రెంటల్ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, ఇది కేవలం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకేనా? ప్రీపెయిడ్ వినియోగదారులకూ వర్తిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి 'రిలయన్స్ బ్రదర్స్' ధాటికి ఇతర టెలికాం కంపెనీలు ఏమవుతాయో?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+