జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో తన కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో ప్రైమ్ వినియోగదారుల కోసం సరికొత్తగా 'ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌'ను విడుదల చేసింది. రూ.399 కంటే ఎక్కువ రీ ఛార్జీ చేసుకొనే వారికి ఈ ఆఫర్ ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

శుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియో

ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో సంచలనాలకు కేంద్రంగా మారింది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత జియో అనేక ఆఫర్లతో తన కష్టమర్ల కోసం ప్రకటించింది.

జియో‌ షాక్: 30 శాతం క్షీణించిన ఇంటెక్స్ విక్రయాలు

ఆకర్షణీయమైన ఆఫర్లతో జియో తన కష్టమర్లను ఇతర టెలికం కంపెనీలకు మళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. అంతేకాదు కొత్త కొత్త ఆఫర్లను ముందుకు తీసుకు వచ్చింది. తాజాగా రిలయన్స్ జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ముందుకు తీసుకువచ్చింది.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

 రూ.399 రీఛార్జీ చేస్తే రూ.2,599 క్యాష్ బ్యాక్ ఆఫర్

రూ.399 రీఛార్జీ చేస్తే రూ.2,599 క్యాష్ బ్యాక్ ఆఫర్

రూ.399 కంటే ఎక్కువ రీఛార్జీ చేసుకొనే జియో ప్రైమ్ సభ్యులకు ప్రతిసారి రూ.2599 విలువైన క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

క్యాష్ బ్యాక్ వోచర్లను మూడు విభాగాలుగా రిలయన్స్ జియో వర్గీకరించింది. మై జియోలో జమచేసేలా ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వోచర్లు ఎనిమిది ఇవ్వనుంది. ఒక్కో వోచర్ విలువ రూ.500. మొబైల్ వ్యాలెటోకి రూ.300 క్యాష్‌బ్యాక్ ఓచర్లు, ఈ కామర్స్‌లో షాపింగ్ చేసేందుకు రూ.1,899 ఓచర్లుంటాయి.ఈ ఆఫర్ నవంబర్ 10 నుండి 25 వరకు ఉంటుందని జియో ప్రకటించింది.

 ఈ వ్యాలెట్ కంపెనీలతో ఒప్పందం

ఈ వ్యాలెట్ కంపెనీలతో ఒప్పందం

అమెజాన్ పే, పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్ వంటి సంస్థలతో రిలయన్స్ జియో ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థకు కొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకొంది.. మిగతావి వినియోగదారుడికి డిజిటల్ వ్యాలెట్‌లోకి నిర్ణీత సమయంలో జమ కానున్నాయి. వినియోగదారుల ఖాతాల్లోకి నవంబర్ 15 నుంచి క్యాష్‌బ్యాక్ ఓచర్లు జమకావడం ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.

 కొత్తగా రీ ఛార్జీ చేసుకొంటే వెంటనే రూ.99 క్యాష్‌బ్యాక్

కొత్తగా రీ ఛార్జీ చేసుకొంటే వెంటనే రూ.99 క్యాష్‌బ్యాక్

కొత్తగా రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు అమెజాన్ పే రూ.99 మేర ‌ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. ఇప్పటికే రీచార్జ్ చేసుకున్న యూజర్లకు రూ.20 వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది.అలాగే పేటిఎంలో కొత్తగా రీచార్జ్ చేసుకుని కస్టమర్లకు రూ.50 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ప్రకటించారు. ఇక వరుసగా.. ఫోన్‌ పేలో రూ.75, మొబిక్విక్‌లో రూ.300 , యాక్సిస్ పేలో రూ.100, ఫ్రీచార్జ్‌లో రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నారు.ఇప్పటికే ఈ యాప్‌ల ద్వారా రీచార్జ్ చేసుకుంటున్న వినియోగదారులకు అమెజాన్‌లో రూ.20, పేటీఎంలో రూ.15, ఫోన్‌పేలో రూ.30, మొబిక్విక్‌లో రూ149, యాక్సిస్ పేలో రూ.35 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది.

రిలయన్స్ ట్రెండ్స్‌లో షాపింగ్

రిలయన్స్ ట్రెండ్స్‌లో షాపింగ్

జియో ప్రైమ్ వినియోగదారులు అజియో, యాత్రా.కామ్‌, రిలయన్స్ ట్రెండ్స్‌లో షాపింగ్ చేయవచ్చు. అజియోలో కనీసం రూ.1500 షాపింగ్ చేసిన వారికి రూ.399 వరకు తగ్గింపు ఉంటుంది. యాత్రా.కామ్ ద్వారా దేశీయ విమానాల్లో ఆల్‌రౌండ్ ట్రిప్ చేసినవారికి వన్‌వేలో రూ.500 వరకు విమాన టికెట్ల తీసుకున్న వారికి రూ.1000 వరకు డిస్కౌంట్ ఉంటుంది. రిలయన్స్ ట్రెండ్స్‌లో రూ.1999 ఆపైన షాపింగ్ చేస్తే రు.500 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. నవంబర్ 20 నుంచి ఈ కామర్స్ వోచర్లు ఇవ్వడం ప్రారంభిస్తామని జియో వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Reliance Jio has unveiled its triple cashback scheme, which gives Jio Prime members a total cashback worth Rs 2,599 on every recharge of Rs 399 or above. This includes instant cashback worth Rs 400, plus Rs 300 cashback vouchers in mobile wallets along with vouchers of up to Rs 1,899 for shopping on e-commerce platforms. The offer will be valid from November 10 to November 25.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి