జియో‌ షాక్: 30 శాతం క్షీణించిన ఇంటెక్స్ విక్రయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు రిలయన్స్ జియో భారీగా దెబ్బ కొట్టింది. 2016-17లో ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ విక్రయాలు 30 శాతం మేర క్షీణించాయి. రిలయన్స్ జియో ప్రభావంతో పాటు పెద్ద నగదు నోట్ల రద్దు కూడ కారణమేనని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

రిలయన్స్ జియో సంచలనాలతో మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే జియో టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది. రిలయన్స్ అనుసరించిన వ్యూహంతో ఇతర టెలికం కంపెనీలు కూడ అదే మార్గంలో పయనించాల్సిన పరిస్థితులు కూడ నెలకొన్నాయి.

జియోకు షాక్: 300 జీబీ 4జీ డేటా, ఉచిత కాల్స్ ఆఫరిచ్చిన ఎయిర్‌టెల్

కొన్ని టెలికం కంపెనీలు రిలయన్స్ జియో‌ అనుసరించిన మార్గాన్నే కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు కూడ నెలకొన్నాయి. టెలికం పరిశ్రమ కూడ కోట్లాది రూపాయాలను నష్టపోయినట్టు నివేదికలు కూడ స్పష్టం చేశాయి. పెద్ద నగదు నోట్ల రద్దు కూడ ఇందుకు కారణంగా మారాయనే అభిప్రాయాలు కూడ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

 ఇంటెక్స్ నష్టాలకు కారణాలివే

ఇంటెక్స్ నష్టాలకు కారణాలివే

దేశంలోనే రెండో అతిపెద్ద హ్యాండ్‌సెట్‌ తయారీదారిగా ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌కు రిలయన్స్‌ జియో భారీగా దెబ్బకొట్టింది. 2016-17లో ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ విక్రయాలు 30 శాతం మేర క్షీణించాయి. దీనికంతటికీ కారణం రిలయన్స్‌ జియో ఎంట్రీ, డిమానిటైజేషన్‌ ప్రభావమేనని తెలిపింది.

తమ రెవెన్యూలు కిందకి దిగజారాయని, రిలయన్స్‌ జియో రాకతో ఇండస్ట్రి హఠాత్తుగా 2జీ, 3జీ నుంచి 4జీకి మారిపోయిందని ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లోపేర్కొంది.

 పెద్ద నగదు నోట్ల రద్దుతో తగ్గిన విక్రయాలు

పెద్ద నగదు నోట్ల రద్దుతో తగ్గిన విక్రయాలు

కొత్త 4జీ హ్యాండ్‌సెట్‌ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందని ఇంటెక్స్ అభిప్రాయపడింది. డిమానిటైజేషన్‌ ప్రభావంతో తమకు ఎక్కువగా విక్రయాలు నమోదయ్యే గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్‌ నుంచి మార్చి కాలంలో విక్రయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రకటించింది. గతేడాది ఇంటెక్స్‌ రెవెన్యూలు రూ.6,223.42 కోట్లగా ఉండగా... 2017 మార్చి వరకు రూ.4,364.08 కోట్లగా నమోదయ్యాయి.

 నికర లాభం 17 శాతం తగ్గుదల

నికర లాభం 17 శాతం తగ్గుదల

అదేవిధంగా ఇంటెక్స్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ.127.3 కోట్లగా నమోదైంది. తక్కువ విక్రయాలు, కొత్త నియామకాలు, ఇతర వ్యయాలు తమ రెవెన్యూలను దెబ్బకొట్టినట్టు కంపెనీ తెలిపింది. కన్జ్యూమర్‌ డ్యూరెబుల్స్‌ బిజినెస్‌, డిజిటల్‌ సర్వీసులతో మొబైల్స్‌, ఇతర సెగ్మెంట్లలో రెవెన్యూలను మెరుగుపరుచుకుంటామని ఇంటెక్స్‌ అధికార ప్రతినిధి చెప్పారు.

 36 శాతానికి వినియోగదారుల డ్యురెబుల్స్

36 శాతానికి వినియోగదారుల డ్యురెబుల్స్

తమ కన్జ్యూమర్‌ డ్యూరెబుల్స్‌ బిజినెస్‌ గతేడాది 24 శాతంగా ఉండగా.. ఈ ఏడాది 36 శాతానికి పెరిగిందని ఇంటెక్స్ ప్రకటించింది. వీటిని 50 శాతానికి పెంచనున్నట్టు తెలిపారు. మైక్రోమ్యాక్స్‌, వీడియోకాన్‌లను అధిగమించి 4 శాతం మార్కెట్‌ షేరుతో ఇంటెక్స్‌ నెంబర్‌ 1 ఇండియా బ్రాండుగా నిలిచినట్టు అధికార ప్రతినిధి చెప్పారు. అయితే జియో ఎంట్రీ, గతేడాది డిమానిటైజేషన్‌తో కంపెనీ మార్కెట్‌ షేరు కొంత తగ్గినట్టు వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Intex Technologies, the second-largest Indian handset maker, said sales plunged 30% in 2016-17 after the disruption caused by the entry of Reliance Jio Infocomm and on account of demonetisation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి