ముగియనున్న జియో ఆఫర్లు: రూ.149, లేదా రూ.309 ప్లాన్ ను ఎంచుకోవాల్సిందే

రిలయన్స్ జియో సమ్మర్ సర్ ఫ్రైజ్ ఆఫర్ ఈ నెలతో ముగుస్తోంది. అయితే ఈ ఆఫర్ ముగుస్తోన్న తర్వాత కొత్త ఆఫర్లను జియో ప్రకటించలేదు.అయితే పాత ఆఫర్ ముగియగానే రూ.149 ప్యాకేజీ ఆటోమెటిక్ గా యాక్టివేట్ అవుతోంది.

ముంబై: రిలయన్స్ జియో సమ్మర్ సర్ ఫ్రైజ్ ఆఫర్ ఈ నెలతో ముగుస్తోంది. అయితే ఈ ఆఫర్ ముగుస్తోన్న తర్వాత కొత్త ఆఫర్లను జియో ప్రకటించలేదు.అయితే పాత ఆఫర్ ముగియగానే రూ.149 ప్యాకేజీ ఆటోమెటిక్ గా యాక్టివేట్ అవుతోంది. అయితే అది ముగిస్తే ఖచ్చితంగా రూ. 309 ప్రతి నెలా రీ ఛార్జీ చేసుకోవాల్సిందే.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశమే సంచలనంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ జియో మార్కెట్లోకి ప్రవేశించింది. మొదటి ఆరుమాసాలు ఉచితంగా జియో తన సేవలను అందించింది. ప్రమోషన్ ముగిసినా తన ఉచిత సర్వీసులను జియో కొనసాగించింది. హ్యాపీ న్యూఈయర్, సమ్మర్ సర్ ప్రైజ్ ధనా ధన్ ఆపర్ల పేర్లతో వినియోగదారులకు అవకాశాలను కల్పించింది.

Reliance Jio Summer Surprise, Jio Dhan Dhana Dhan Offers End in July: What Happens Next?

అతి తక్కువ ధరలకు జియో సేవలను పొందిన కస్టమర్లకు ఇక గండి పడనుంది. జియో ఆఫర్ల గడువు ఈ నెల చివరితో ముగియనున్నాయి.ఈ రెండు ఆఫర్లు కలిగి ఉన్న వారిపై ఈ డెడ్ లైన్ ప్రభావం పడనుంది. ఏప్రిల్ మాసంలో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను జియో ప్రకటించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 15వ, తేదిలోపుగా రూ.303 లేదా రూ.499 తో రీ చార్జీ చేసుకొన్న జియో యూజర్లు ఆ ప్యాక్ లను నెలరోజులపాటు కాకుండా 3 నెలలవరకు వాడుకొనే అవకాశం కల్పించింది. 90 రోజుల గడువు పూర్తైన తర్వాత రూ.303 లేదా రూ.499 రీ ఛార్జీతో మరో 28 రోజుల పాటు ఈ సర్వీసులను వాడుకోవచ్చు. అంటే ఈ నెల 30వ, తేదివరకు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

రూ.309 తో అంతకంటే ఎక్కువ మొత్తంతో రీ చార్జీ చేసుకొని జియో సర్వీసులను వాడుకోవాలి. ఒకవేళ మీరు ముందస్తుగానే జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకొని ఉండి, సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను పొందడానికి రూ.303 రీచార్జీ చేసుకోవడం కంటే ముందస్తుగా రూ.149 తో లేదా అంతకంంటే తక్కువ ప్యాక్ తో రీ ఛార్జీ చేసుకొని ఉంటే తక్కువ విలువ గల ప్యాకేజీ యాక్టివేట్ అవుతోంది. రూ.303 ప్లాన్ గడువు ముగియగానే రూ.149 ప్యాక్ ఆటోమెటిక్ గా యాక్టివేట్ అవుతోంది. ఒక్కసారి అది ముగిశాక, ఖచ్చితంగా రూ.309 తో ప్రతి నెలా రీచార్జీ చేసుకోవాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+