వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: 3 కోట్ల విద్యార్థులకు ఫ్రీ వైఫై ఇవ్వనున్న జియో

రిలయన్స్ జియో 38 వేల కళాశాలలకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు సన్నద్దమౌతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి జియో ప్రతిపాదనలను పంపిందని సమాచారం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 38 వేల కళాశాలలకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు సన్నద్దమౌతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి జియో ప్రతిపాదనలను పంపిందని సమాచారం.

మార్కెట్లోకి రావడంతోనే సంచలనాలకు కేంద్రంగా మారింది జియో. అయితే ఆరు మాసాలు దాటినా తర్వాత కూడ సంచలనాలకు కారణమౌతూనే ఉంది.

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?

తాజాగా రిలయన్స్ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్‌లో అనేక రకాల ఆఫ్షన్లు ఉంటాయని ఆ కంపెనీ ప్రకటించింది.

జియో దెబ్బ: 3 నెలలకు రూ.550 కోట్లు నష్టపోతోన్న ఎయిర్‌టెల్జియో దెబ్బ: 3 నెలలకు రూ.550 కోట్లు నష్టపోతోన్న ఎయిర్‌టెల్

అయితే ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 1వ, తేది నుండి అందుబాటులోకి తీసుకువస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 24 నుండి ఈ ఫోన్ కొనుగోలు కోసం బుకింగ్ ప్రారంభించనున్నట్టు రిలయన్స్ కంపెనీ ప్రకటించింది.

మూడు కోట్ల విద్యార్థులకు ఉచిత వైఫై

మూడు కోట్ల విద్యార్థులకు ఉచిత వైఫై

దేశంలోని 38 వేల కళాశాలలకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకుగాను జియో యోచిస్తోంది.ఈ మేరకు కేంద్రప్రభుత్వం వద్ద ప్రతిపాదనలను పంపింది. అయితే కేంద్రం ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తే జియో ఉచితంగా ఈ కాలేజీలకు వైఫైను ఇవ్వనుంది.

Recommended Video

Reliance Jio's Big Announcement on July 21, Here's What You Want
38 వేల కళాశాలల్లో

38 వేల కళాశాలల్లో

దేశంలోని 38వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకు జియో ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మేరకు తమ కంపెనీ నుండి మాత్రం జియో కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది.

జియోకే ప్రాజెక్టు

జియోకే ప్రాజెక్టు

ఉచిత వైఫై సేవలను అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే ఈ మేరకు కేంద్రానికి జియో పంపిన ప్రతిపాదనలు కూడ మానవవనరుల మంత్రిత్వశాఖకు అందాయి. అయితే ఉచితంగానే వైఫై సేవలను అందిస్తామని జియో ప్రకటించడంతో ఈ ప్రాజెక్టు ఆ కంపెనీకే దక్కే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది . కానీ, ఈ విషయంలో కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.

టెండర్ ప్రాసెస్ బట్టే అమలు

టెండర్ ప్రాసెస్ బట్టే అమలు

ఇతర కంపెనీలు కాకుండా కేవలం జియోకే ఈ ప్రాజెక్టును అప్పగించడం సరికాదనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే టెండర్ ప్రక్రియను అమలు చేయడం ద్వారానే దీన్ని అమలు చేస్తామన్నారు.టెండర్ విధానాన్ని అమలు చేస్తే అన్ని టెలికం కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొంటాయి. అయితే టెండర్ పద్దతి నియమాల ప్రకారంగా ఏ కంపెనీ అర్హత సాధిస్తోందో ఆ కంపెనీకి టెండర్లు దక్కే అవకాశాలున్నాయి.

English summary
After announcing free phones, Reliance Jio now wants to provide free Wi-Fi to three crore college students across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X