రిలయన్స్ ఫీచర్‌ఫోన్‌లో ఒకే సిమ్, ఇతర సిమ్‌లు పనిచేయవు
రిలయన్స్ పీచర్ ఫోన్ సింగిల్‌సిమ్ మాత్రమే ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక ప్రత్యేకతలు ఉన్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది.
ముంబై: రిలయన్స్ పీచర్ ఫోన్ సింగిల్‌సిమ్ మాత్రమే ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక ప్రత్యేకతలు ఉన్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎన్ని సిమ్‌కార్డులతో ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చనే విషయమై స్పష్టత రాలేదు. ఒకే సిమ్‌కార్డుతో ఈ ఫోన్ ఉపయోగించుకొనేలా తయారుచేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నుండి రిలయన్స్ పీచర్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఫోన్‌కు తొలుత సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లిస్తే ఫోన్‌ను ఇవ్వనున్నారు. అయితే మూడేళ్ళ తర్వాత ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇచ్చివేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
అయితే ఈ ఫోన్‌లో అనేక ప్రత్యేకతలున్నాయని ముఖేష్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. అయితే ఫోన్‌లో ఎన్ని సిమ్‌కార్డులతో వాడుకోవచ్చనే అంశంపై స్పష్టత ఎట్టకేలకు వచ్చింది.

ఒకే సిమ్‌కార్డ్‌తో ఫీచర్ పోన్
రిలయన్స్ ఫీచర్ ఫోన్‌లో ఒకే సిమ్ కార్డు పనిచేస్తోందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఈ ఫోన్ వోల్టే టెక్నాలజీ పనిచేయనుంది. అయితే ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్ లాంటి సిమ్‌కార్డులు ఈ ఫోన్‌లో పనిచేసే అవకాశాలు లేవని ఆ కంపెనీ పనిచేస్తాయి. అయితే ఇదే తరహ సర్వీస్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఎయిర్‌టెల్ కూడ ప్రకటించింది.
Recommended Video


ఉచిత ఫోన్‌పై మెలిక పెట్టిన రిలయన్స్
ఉచిత ఫోన్‌పై రిలయన్స్ మెలికపెట్టింది. రూ.1500 డిపాజిట్ చేసి, రిలయన్స్ ఫీచర్ పోన్ స్వంతం చేసుకొంటే మూడేళ్ళ తర్వాత ఆ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.అయితే ప్రతినెలా రిలయన్స్ జియో రీచార్జీ చేసుకొంటే పూర్తి మొత్తాన్ని మూడేళ్ళ తర్వాత వెనక్కు చెల్లించేందుకు ఆ కంపెనీ ప్లాన్ ఉందని ఓ రిపోర్ట్ వెల్లడిస్తోంది. అయితే మధ్యలో రీఛార్జీ చేసుకోకపోతే పూర్తి మొత్తాన్ని చెల్లించే అవకాశాలు లేవని ఆ రిపోర్ట్ చెబుతోంది.

కేబుల్ ప్రసారాలు సక్సెస్ కావు
ఈ ఫోన్‌తో పాటే కేబుల్ ప్రసారాలను టీవీలో చేసే కేబుల్ కూడ అందిస్తామని రిలయన్స్ వెల్లడించింది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న డిటిహెచ్ సంస్థలు మాత్రం ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. ఫోన్ కేబుల్‌తో పాటు టీవి అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే టీవీలో ప్రసారాలను చూసే వీలుంటుంది. ఫోన్‌ను బయటకు తీసుకెళితే టీవీలో ప్రసారాలు చూసే వీలుండదు. ఫోన్ కేబుల్ సక్సెస్ కాదనే అభిప్రాయంతో డీటీహెచ్ సంస్థలున్నాయి.

రూ.309 తో కేబుల్ టీవీ ప్రసారాలు
రిలయన్స్ జియో కేబుల్ టీవి యాక్ససరీస్‌ను టివికి కనెక్ట్ చేసుకొంటే కేబుల్ ప్రసారాలను జియో ఫోన్‌లోని సినిమా యాప్ ద్వారా చూసే వెసులుబాటు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పోన్‌కు టీవికి అనుసంధానం చేసే టీవి యాక్ససరీస్‌ను రూ.309 విక్రయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications