"రిలయన్స్ పియో" : సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సరదా పోస్టు
న్యూఢిల్లీ : మొన్నీమధ్యే రిలయన్స్ ప్రవేశపెట్టిన జియో ద్వారా మిగతా టెలికాం సంస్థలన్నీ కుదేలైన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎందులో అడుగుపెట్టినా.. కస్టమర్స్ అంతా రిలయన్స్ వైపే క్యూ కట్టాలన్న చందంగా రిలయన్స్ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మద్యం రంగంలోకి కూడా రిలయన్స్ ఎంట్రీ ఇవ్వాలని.. దానికి 'రిలయన్స్ పియో' అని పేరు పెట్టాలని సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు పలువురు నెటిజెన్స్.

తాజాగా దీనికి సంబంధించిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మందుబాబుల తరుపున రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని అభ్యర్థిస్తూ.. ' అంబానీ గారు, దయచేసి మీరు మద్యం వ్యాపారంలోకి కూడా రావాల్సిందిగా విజ్నప్తి. దానికి రిలయన్స్ పియో అని పేరు పెట్టి ఫ్రీగా మద్యం సప్లై చేయండి. కేవలం స్నాక్స్ కు మాత్రం చార్జ్ చేయండి' అంటూ పోస్టులో రాసి ఉంది.
మొత్తానికి మందుబాబుల కన్ను రిలయన్స్ పై పడిందన్నమాట. ఏదేమైనా ఇప్పుడీ సరదా పోస్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications