రెండో దశ: దీపావళి తర్వాతే రిలయన్స్ ఫీచర్ ఫోన్ల బుకింగ్స్

రిలయన్స్ ఫీచర్ ఫోన్ల రెండో దశ బుకింగ్స్ అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.2017, ఆగస్టు 24న మొదటి దశ జియో ఫ్రీ ఫోన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఫీచర్‌ పోన్ల రెండో దశ బుకింగ్స్‌ను దీపావళి తర్వాత ప్రారంభించనుంది.ఈ ఏడాది అక్టోబర్‌ చివర లేదా నవంబర్‌ మొదటి వారంలో రెండో దశ రిలయన్స్ ఫీచర్ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభించనున్నట్టు రిలయన్స్ ప్రతినిధి ప్రకటించారు.

2017, ఆగస్టు 24న మొదటి దశ జియో ఫ్రీ ఫోన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు మిలియన్ల మంది జియో ఫోన్‌ను బుక్‌ చేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాల నుంచి ఈ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులకు ఈ ఫోన్లు అందిన తర్వాతే రెండో దశ ప్రారంభించనున్నట్లు గతంలోనే ప్రకటించారు.

Reliance Retail to resume JioPhone booking post Diwali

జులై 21న రిలయన్స్‌ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫోన్‌ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫ్రీ ఫోన్‌ అయినప్పటికీ ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు ఇస్తామని జియో అప్పట్లో ప్రకటించింది.

రిలయన్స్ దారిలోనే ఎయిర్‌టెల్ కూడ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలనే మార్కెట్లోకి విడుదల చేసింది. టెలికం రంగంలో పోటీ కారణంగా వినియోగదారులకు తక్కువ ధరకే కాల్ ఛార్జీలు, డేటా అందుబాటులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+