లైంగిక వేధింపులు: ఎంపీ శశికళకు ఊరట
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆగ్రహానికి గురై ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఎంపీ శశికళ పుష్పకు ఢిల్లీ హై కోర్టులో ఊరట లభించింది.
ఎంపీ శశికళ, ఆమె కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారి ఇంటి పనిమనిషి చేసిన ఫిర్యాదు మేరకు వారి మీద కేసు నమోదు అయ్యింది. ఎంపీ శశికళ, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యరాదని ఢిల్లీ హై కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీ శశికళ పుష్ప, ఆమె భర్త, కుమారుడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఢిల్లీ హై కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శశికళ ఇంట్లో పని చేస్తున్న వారు ఆమెకు వ్యతిరేకంగా తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో శశికళ పుష్ప ఇంట్లో పని చేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది కాక ఇప్పుడు ఆమె ఇంటిలో పని చేస్తున్న పనిమనుషులు లైంగిక వేధింపుల కేసు పెట్టారు.
దీంతో శశికళ పుష్ప ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద రాజ్యసభలో తీవ్ర ఆరోపణలు చేసిన శశికళ పుష్ప ఢిల్లీలోనే మకాం వేశారు. రాజసభ సభ్వత్వానికి రాజీనామా చెయ్యాలని చెప్పినా శశికళ పట్టించుకోలేదు.
అమ్మ జయలలిత మాట ధిక్కరించారు. కనీసం తమిళనాడు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ సందర్బంలో ఆమె ఇంటి పనిమనులు లైంగిక వేధింపుల కేసు పెట్టారు. అదే సమయంలో ఆమె భర్త లింగేశ్వర తిలగం, కుమారుడు పృద్వీరాజ్‌లపై ఫిర్యాదులు పెరిగిపోయాయి.
కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని నమ్మించి రూ. లక్షలు వసూలు చేశారని, మమ్మల్ని వేధించారని, బెదిరించారని, దాడులు చేశారని అనేక మంది రోజురోజుకూ ఫిర్యాదులు చేస్తున్నారు. శశికళ దగ్గర రాజీనామా చేయించాలని ఆన్నాడీఎంకే వర్గాలు ఒత్తిడి చేస్తున్నారు.
అమ్మ గురించి పూర్తిగా తెలిసిన శశికళ పుష్ప ఢిల్లీలోనే మకాం వేసి కోర్టును ఆశ్రయించారు. మొత్తం మీద అమ్మ జయలలితను ఎదిరించిన శశికళ ఎంతకాలం ఢిల్లీలో ఉంటారో మేము చూస్తామని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications