Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాదాస్పాద వ్యాఖ్యలు: నుపుర్ శర్మకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర పోలీసులు

న్యూఢిల్లీ: ముహమ్మద్ ప్రవక్త , ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేసి, నవీన్ జిందాల్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ముంబ్రా పోలీసులు మంగళవారం జూన్ 22న శర్మను హాజరుకావాలని సూచించారు.

మే నెలాఖరున జరిగిన టెలివిజన్ చర్చలో ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలకు గానూ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెను న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీకి నిలబెట్టింది. ఆమె ఓడిపోయింది.

అదే సమయంలో, ప్రవక్త గురించి రెచ్చగొట్టే ట్వీట్లకు ఢిల్లీలోని పార్టీ మీడియా విభాగానికి నేతృత్వం వహిస్తున్న నవీన్ కుమార్ జిందాల్‌ను బీజేపీ ఢిల్లీ యూనిట్ బహిష్కరించింది.

బేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న నూపుర్ శర్మ

ఇటీవల టీవీ చర్చలో ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నూపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో నూపుర్ శర్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు.

Remarks on Prophet: Mumbra Police summon suspended BJP spokesperson Nupur Sharma

'నా మాటలు ఎవరికైనా అసౌకర్యాన్ని కలిగించినా లేదా ఎవరికైనా మతపరమైన భావాలను గాయపరిచినట్లయితే, నేను బేషరతుగా నా ప్రకటనను ఉపసంహరించుకుంటాను. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు' అని నూపుర్ శర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

'గత చాలా రోజులుగా మా మహాదేవ్‌ను అవమానిస్తున్నారని, అగౌరవపరిచారని నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. ఇది శివలింగం కాదు [జ్ఞానవాపి మసీదు వద్ద] ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబున్నారు. ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా ఎగతాళి చేస్తున్నారు' అని నూపుర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

'మా మహాదేవ్‌పై ఈ నిరంతర అవమానాన్ని, అగౌరవాన్ని నేను సహించలేకపోయాను. దానికి ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను' అని నూపుర్ శర్మ తెలిపారు.

బీజేపీ నుంచి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ సస్పెండ్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం నాడు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. మహమ్మద్ ప్రవక్త ‌పై శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ సంబంధం లేదని ప్రకటించిన అనంతరం ఈ మేరకు చర్య తీసుకుంది.

ఏ వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే భావజాలానికి పార్టీ తీవ్రంగా వ్యతిరేకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అలాంటి వ్యక్తులకు లేదా సిద్ధాంతాలకు బీజేపీ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రతి మతాన్ని గౌరవించే హక్కును కల్పించిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.

"భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారతదేశాన్ని అందరూ సమానులుగా, ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించే గొప్ప దేశంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము, ఇక్కడ అందరూ భారతదేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటారు, ఇక్కడ అందరూ అభివృద్ధి, అభివృద్ధి ఫలాలను అనుభవిస్తారు అని ఆయన వెల్లడించారు.

గత వారం టీవీ చర్చలో నుపుర్ శర్మ ప్రవక్తను అవమానించేలా చేసిన వ్యాఖ్య ముస్లిం సమూహాల నుంచి భారీ నిరసన వ్యక్తమైంది. అంతకుముందు శుక్రవారం శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మార్కెట్లను మూసివేయాలని పిలుపునిచ్చి క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది పోలీసు సిబ్బందితో సహా కనీసం 40 మంది గాయపడ్డారు.

కాన్పూర్‌లో ఘర్షణలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి 80 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+