మరో ఏడేళ్లలో దశలవారీగా ముంబైలోని హ్యాంగింగ్ గార్డెన్స్ తొలగింపు..

ముంబై నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 136 చరిత్ర కలిగిన హ్యాంగింగ్ గార్డెన్స్ కనుమరుగుకానుంది. ముంబైవాసులకు నీటి సరఫరాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు అనివార్యమని అధికారులు చెబుతున్నారు. ఈ గార్డెన్ దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ పైభాగంలో ఉంది. ఇక్కడి రిజర్వాయర్‌ను పునర్నిర్మించేందుకు ఏడేళ్ల దశల వారీగా ప్రణాళికను రూపొందించారు.

350 చెట్ల‌ను తొల‌గించి..:"ఏడేళ్ల వ్యవధిలో రిజర్వాయర్‌ను కూల్చివేసి పునర్నిర్మించాలనేది మా ప్రణాళిక" అని అదనపు మున్సిపల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) పి.వెల్రాసు తెలిపారు. పక్కనే ఉన్న ప్లాట్‌లో సుమారు 350 చెట్లను తొలగించి మొత్తం ల్యాండ్‌స్కేప్ ప్రాంతాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. నివాసితుల నిరసనలపై స్పందిస్తూ, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ లోధా మంగళవారం ఈ అంశంపై బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. నగరంలోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటిగా ఉన్న ఈ రిజర్వాయర్ SoBoలోని చాలా ప్రాంతాలకు గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీటిని సరఫరా చేయడానికి రూపొందించబడింది. లోధా మాట్లాడుతూ, "ప్రత్యామ్నాయాలు ఉంటే వాటిని అన్వేషించవచ్చు. అయితే దక్షిణ ముంబైకి సరఫరా చేయడానికి గ్రావిటీని ఉపయోగించే బదులు, ఇక్కడ నీటిని పంప్ చేయాల్సి ఉంటుంది" అని లోధా అన్నారు.

Removal of Hanging Gardens in Mumbai in next seven years.

698 కోట్ల రూపాయలతో హ్యాంగింగ్ గార్డెన్స్‌ను కూల్చివేసి, దాని కింద ఉన్న భారీ ట్యాంక్‌ను పునర్నిర్మించే ప్రణాళిక నిర్మాణాత్మకంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే, దీని కింద ఉన్న వనరులు బలహీనంగా ఉన్నందున గార్డెన్ రక్షణ కవచంలా ఉంది. దాని తొలగింపులో ఏ మాత్రం అశ్రద్ధ చూపినా అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2017లో ప్రణాళికలు మొదలుపెట్టారు.

3 మిలియ‌న్ల జ‌నాభాకు అనుగుణంగా..:సివిక్ హైడ్రాలిక్ డిపార్ట్‌మెంట్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అదనపు మునిసిపల్ కమీషనర్ పి.వెల్రాసు మాట్లాడుతూ, ప్రస్తుతం 147 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న ట్యాంక్ వల్ల BMC పాక్షికంగా కూల్చివేసినా ప్రమాదం లేదని అన్నారు. రిజర్వాయర్ ఐదు గదులను కలిగి ఉండి, సుమారు 22,000 చదరపు మీటర్ల ఉపరితల వైశాల్యం కలిగి ఉంది. "పైకప్పు మరియు సపోర్టింగ్ కాలమ్‌లు కూలిపోతేనే నిజమైన ముప్పు. అది దక్షిణ ముంబై మొత్తానికి నీటి సరఫరాపై ప్రభావితమవుతుంది" అని అతను తెలిపారు. BMC యొక్క స్టాండింగ్ కమిటీ 2022లో దాని సామర్థ్యాన్ని 191 మిలియన్ లీటర్లకు పెంచాలనే ప్రతిపాదనను ఆమోదించింది. దక్షిణ ముంబైలో అంచనా వేయబడిన 3 మిలియన్ల జనాభాకు అనుగుణంగా రిజర్వాయర్‌ను నిర్వహించడానికి కేటాయించబడినప్పటికీ వాస్తవ పరిస్థితులకు దృష్టిలో పెట్టకుని కార్పొరేటర్లు ప్రాజెక్ట్‌కు మద్దతు పలికారు. భారీ భవన సముధాయాలు దీని స్కైలైన్‌లో పెరుగుతున్నందున, నీటి కోతలను నివారించడానికి నగరంలోని అభివృద్ధి చెందుతోన్న ప్రాంతాలకు సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Removal of Hanging Gardens in Mumbai in next seven years.

200 మొక్క‌లు నాటాలి..:అయితే, ఇప్పుడు ఉద్యానవనం పరిసరాల్లో చెట్లను నరికి, నాటడంపై నోటీసులు జారీ చేయడంతో పెద్ద సవాల్లు ఏర్పడుతున్నాయి. వాటి తొలగింపు ప్రక్రియ కారణంగా ఎదురయ్యే సమస్యలను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తొలగింపు బ్లాక్‌లోని మొత్తం 389 చెట్లలో 189 చెట్లను నరికివేయాల్సి ఉండగా, 200 మొక్కలను నాటాలి. అయితే, వీటిలో భారీ వృక్షాలతోపాటు పండ్లజాతులకు చెందిన మామిడి, జాక్‌ఫ్రూట్, కొబ్బరి, ఉసిరి చెట్లు ఉన్నాయి. ఎలాంటి సమస్యా తలెత్తకుండా అధికారులు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+