వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రఖ్యాత వైద్యుడు,పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు కన్నుమూత... వైద్య రంగంలో ఆయనో శిఖరం...

|
Google Oneindia TeluguNews

ప్రఖ్యాత వైద్యులు,రేడియాలజిస్ట్ ప్రొఫెసర్,పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(ఏప్రిల్ 16) తుదిశ్వాస విడిచారు.కృష్ణా జిల్లాలోని పెద్ద ముత్తేవిలో 1925లో డాక్టర్ కాకర్ల జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది. ఆ తర్వాత విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు.

అమెరికాలో వైద్య సేవలు...

అమెరికాలో వైద్య సేవలు...

1951లో హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లోనే ఉత్తీర్ణత సాధించారు.1954-56 మధ్య న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో పనిచేశారు. 1956లో భారత్‌కు తిరిగొచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. తర్వాతి కాలంలో అదే మెడికల్ కాలేజీలో రేడియాలజిస్ట్‌గా పదోన్నతి పొందారు.

1970లో ఆయన తిరిగి అమెరికా వెళ్లిపోయారు. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఫెలో ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ రేడియాలజిస్ట్ పట్టా అందుకున్నారు. అమెరికాలోనే కొన్నేళ్ల పాటు వైద్య సేవలు అందించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షుడు సుబ్బారావే కావడం విశేషం.

నిమ్స్ డైరెక్టర్‌గా...

నిమ్స్ డైరెక్టర్‌గా...

1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎన్‌ఐఆర్‌లకు ఇచ్చిన పిలుపుమేరకు సుబ్బారావు తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. నిమ్స్ డైరెక్టర్‌గా పదేళ్లపాటు ఎలాంటి వేతనం తీసుకోకుండానే సేవలు అందించారు. అర్థోపెడిక్ విభాగంలో అప్పటివరకూ మంచి గుర్తింపు కలిగిన నిమ్స్‌ను మిగతా విభాగాల్లోనూ కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా నిలపడంలో సుబ్బారావు కీలక పాత్ర పోషించారు.రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు,జర్నల్స్ రాశారు.

2000 సంవత్సరంలో పద్మశ్రీ

2000 సంవత్సరంలో పద్మశ్రీ

దేశ విదేశాల్లో ఎన్నో వేదికలపై వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు మార్చి 17, 2001న ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు.అలాగే, రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. వైద్య విద్యలో కాకర్ల సుబ్బారావు క్వాలిఫికేషన్స్ ఎంబీబీఎస్, యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి. ( FRCR, FACR, FICP, FSASMA, FCCP, FICR, FCGP).

English summary
Noted radiologist and former Director of Nizam’s Institute of Medical Sciences (NIMS), Dr Kakarla Subba Rao has passed away in the wee hours of Friday here at Krishna Institute of Medical Sciences (KIMS), Secunderabad. He was 94.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X