నవ్వుపై జిఎస్టీ లేదు: మోడీ వ్యాఖ్యపై మరోసారి రేణుకా చౌదరి ధ్వజం

Posted By:
Subscribe to Oneindia Telugu
  Renuka Chowdhury Issue : Here Are The Reactions Of Politicians And Parties

  పానాజీ: తన నవ్వుపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు పార్లమెంటు సభ్యుల ఆందోళన మధ్య ప్రధాని బుధవారం రాజ్యసభలో ఇటీవల సమాధానమిచ్చిన సమయంలో రేణుకా చౌదరి నవ్విన విషయం తెలిసిందే.

  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు అవసరం లేదని మహాత్మా గాంధీయే చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెసు లేని భారత్ అనే నినాదం తనది కాదని, గాంధీజీదేనని ఆయన అన్నారు. ఆ సమయంలో రేణుకా చౌదరి పెద్దగా నవ్వారు.

  రేణుకా చౌదరి ప్రసంగంపై మోడీ

  రేణుకా చౌదరి ప్రసంగంపై మోడీ

  రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాని మోడీ స్పందిస్తూ - అప్పట్లో రామాయణం సీరియల్‌లో అలాంటి నవ్వులు విన్నామని ఇప్పుడు మరోసారి వింటున్నామని అన్నారు. వ్యంగ్యాస్త్రాలకు బిజెపి ఎంపీలు హర్షధ్వానాలు చేశారు.

  నవ్వుపై జిఎస్టీ లేదు..

  నవ్వుపై జిఎస్టీ లేదు..

  మోడీ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి తాజాగా పానాజీలో స్పందించారు. ఎలా నవ్వాలి... ఎప్పుడు నవ్వాలి అని.. నవ్వుపై జిఎస్టీ లేదని, నవ్వేందుకు తనకు ఎవరి అనుమతి కూడా అక్కరలేదని ఆమె అన్నారు.

  మోడీ నెగెటివ్ పాత్రతో పోల్చారు..

  మోడీ నెగెటివ్ పాత్రతో పోల్చారు..

  తాను ఐదు దఫాలుగా రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నానని రేణుకా చౌదరి అన్నారు. అలాంటి తనను మోడీ ఓ నెగెటివ్ పాత్రతో పోల్చారని, ఇది మహిళల పట్ల మోడీ దృక్పథానని చాటుతోందని అన్నారు.

  రిజిజు పోస్టు ఇలా..

  రిజిజు పోస్టు ఇలా..

  రామాయణంలోని ఏ పాత్రకు రేణుకా చౌదరి సరిపోలుతారనే విషయాన్ని మోడీ చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పడానికే అన్నట్లు కిరణ్ రిజిజు వీడియో పోస్టు చేశారు. శూర్పణఖ వికటంగా నవ్వుతున్న వీడియోను పోస్టు చేశారు. 1980లో రామాయణం సీరియల్ టెలివిజన్‌లో ప్రసారమైంది. ఆ సీరియల్‌లోని పాత్ర నవ్వు తనకు గుర్తు వస్తోందని మోడీ రేణుకా చౌదరిపై వ్యాఖ్యానించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congess Rajya Sabha member Renuka Chowdhury once again made comment against PM Narendra Modi at Panaji.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి