వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే ఉత్సవాలు: 6వ, వరుసలో రాహుల్‌కు సీటు, భగ్గుమన్న కాంగ్రెస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు హజరైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీకి ఆరవ వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది సంప్రదాయాలను పక్కన పెట్టి చవకబారు రాజకీయాలకు బిజెపి దిగుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.

రాహుల్‌ గాంధీకి ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం చౌకబారు ఎత్తుగడలకు దిగిందని కాంగ్రెస్ పార్టీ మ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్‌ రణ్‌దీప్‌ సూర్జీవాలా వ్యాఖ్యానించారు.

Republic Day: Rahul Gandhi takes 6th row seat; Congress fires salvo at govt

గతంలో ఏఐసీసీ అధినేత్రిగా సోనియా గాంధీ రిపబ్లిక​ డే పరేడ్‌లో ముందువరుసలో కూర్చునేవారని ఆ పార్టీ వర్గాలు గుర్తు చేశాయి. రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఆరవ వరసలో కూర్చోపెట్టారని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు.ప్రభుత్వ అభిమతమేదైనా తమకు మాత్రం రిపబ్లిక్‌ డే వేడుకలే ప్రధానమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

సూర్జీవాలా రిపబ్లిక్‌ డే వేడుకల్లో సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పక్కన కూర్చున రాహుల్‌ ఫోటోను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ముందువరుసలో మాజీ ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, మన్మోహన్‌ సింగ్‌లు కూర్చున్నారు. కాగా, రిపబ్లిక్‌ డే వేడుకలకు తొలిసారిగా పది ఆసియాన్‌ దేశాధినేతలు హాజరయ్యారు.

English summary
Congress president Rahul Gandhi on Friday attended the Republic Day Parade and took the designated seat in the sixth row, prompting an angry reaction from his party that accused the government of setting aside tradition and indulging in "cheap politics".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X