Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హై అలర్ట్: గణతంత్ర వేడుకల వేళ భారీ దాడికి ప్లాన్!

దేశ రాజధాని ఢిల్లీ నిశ్శబ్దంగా ఉంది… కానీ ఆ నిశ్శబ్దం వెనక ఉత్కంఠ దాగుంది. రిపబ్లిక్ డేకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, దేశ భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ మోడ్లోకి వెళ్లింది. ఇంటెలిజెన్స్ వర్గాల టేబుళ్ల మీదికి వచ్చిన ఒక రిపోర్ట్… అధికారుల్లో హై టెన్షన్ నెలకునేలా చేశాయి.

రిపబ్లిక్ డే వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ అలర్ట్ అయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన కీలక సమాచారం మేరకు, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, ఖలిస్తానీ తీవ్రవాద సంస్థలు కలిసి భారత్‌లో దాడులకు కుట్ర పన్నుతున్నట్టు హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు కొన్ని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్రలు సాగుతున్నాయని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

Republic Day Security Alert

ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు విదేశాల్లో కూర్చుని భారత్‌లోని లోకల్ గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న నేరగాళ్లను సంప్రదించి, ఆయుధాలు, నిధులు, లాజిస్టిక్ సహాయం అందిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దేశ వ్యాప్తంగా హై అలర్ట్

రిపబ్లిక్ డే పరేడ్ జరిగే మార్గాలు, రెడ్ ఫోర్ట్ పరిసరాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్ ప్రాంతాలు వంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, అండర్‌కవర్ పోలీసుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బీఎస్‌ఎఫ్‌ అలర్ట్..

అదే సమయంలో, డ్రోన్ దాడుల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆకాశమార్గంలో కూడా పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. రిపబ్లిక్ డే వేడుకలు పూర్తయ్యే వరకు ఢిల్లీ పరిధిలో నో-ఫ్లై జోన్ అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా బీఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ, ప్రత్యేక కమాండో బృందాలను అప్రమత్తం చేశారు.

సైలెంట్ స్ట్రైక్స్

భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి ఉగ్రవాద సంస్థలు నేరుగా భారీ దాడులకన్నా, చిన్న గుంపుల ద్వారా సైలెంట్ స్ట్రైక్స్ చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకమని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే రిపబ్లిక్ డే వేడుకలను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు అమలు చేస్తామని స్పష్టం చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+