Republic-Jan ki baat exit poll: సత్తా చాటిన జేఎంఎం, వెనకబడ్డ బీజేపీ

రాంచీ: శుక్రవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం సాయంత్రం రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా జార్ఖండ్‌లో బీజేపీ అధికారానికి దూరమవుతోందని తేల్చింది.

బీజేపీ - 22-30
జేఎంఎం 28-33
కాంగ్రెస్ - 10-15
ఏజేఎస్‌యూ - 3-5
ఆర్జేడీ - 3-4
ఎంసీసీ -2

Republic-Jan ki baat exit poll: bjp loses Jharkhand momentum

81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలంటే 42 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీజేపీకి 22-30 సీట్లు మాత్రమే రావడం, మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ-3-5కి కూడా తక్కువ సీట్లే రావడంతో బీజేపీ అధికారానికి దూరమైనట్లేనని తెలుస్తోంది. శుక్రవారం విడుదలైన సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయి.

కాశీష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్

కాశీష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీకి 25-30, కాంగ్రెస్ పార్టీ కూటమికి 37-49, ఏజేఎస్‌యూ 2-4, ఇతరులు 2-4 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ అయిన 42 సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టైమ్స్ నౌ ఇలా..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 44 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని టైమ్స్ నౌ లెక్కగట్టింది. కూటమిలో జేఎంఎం 23 సీట్లు దక్కనుండగా, కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, ఆర్జేడీకి 5 స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలియజేసింది. బీజేపీ 28 సీట్లు, జేవీఎం 3 సీట్లతో సరిపెట్టుకుందని వెల్లడించింది. ఇతరులు ఆరు సీట్లను గెలవనుండగా ఏజేఎస్‌యూ ఖాతా తెరవబోదని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+