నన్ను కాపాడండి: షారుక్ సినిమా చూస్తూ సుష్మాకు ట్వీట్ చేశాడు!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ తమ బాధలను చెప్పుకున్న వారికి క్షణాల్లో పరిష్కారం చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అప్పుడప్పుడు ఆమెకు కొందరు అనవసరమైన ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, అలాంటి ఓ ట్వీటే ఆమెకు వచ్చింది.

ఆ విషయానికొస్తే.. బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌ నటించిన 'జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌' చిత్రం చూస్తూ ఓ వ్యక్తి థియేటర్‌ నుంచే కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్‌ పెట్టాడు. పుణెకి చెందిన విశాల్‌ సూర్యవంశి అనే యువకుడు స్థానిక జియాన్‌ థియేటర్‌లో సినిమా చూడ్డానికి వెళ్లాడు.

ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా థియేటర్‌ నుంచే.. 'సుష్మా మేడమ్‌. నేను'జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌' సినిమా చూస్తున్నాను. వీలైనంత త్వరగా నన్ను కాపాడండి' అని ట్వీట్‌ చేశాడు. అయితే తనకు వచ్చిన సమస్యేంటో మాత్రం తెలపలేదు.

Chandrababu Naidu Survey Report on Ministers

కాగా, విశాల్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కి కొద్దిసేపట్లోనే 2500లకు పైగా లైక్‌లు, 1631 రీట్వీట్లు వచ్చాయి. కాగా, దీనిపై సుష్మా ఇంకా స్పందించలేదు. అయితే, 'జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌' సినిమాకు బాక్స్ ఆఫీసు వద్ద మంచి టాక్ రాలేదు. దీంతో చాలా మంది సినీ అభిమానులు షారుక్ సినిమాపై సెటైర్లు వేస్తున్నారు. కాగా, ఈ సినిమా చూడలేకే విశాల్ ఈ ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's External Affairs Minister Sushma Swaraj has close to nine million followers on Twitter. Most of the times, she manages to respond to large number of emergency tweets on the micro-blogging site.
Please Wait while comments are loading...