Uttarakhand tunnel collapse: 41 మంది కార్మికుల కోసం కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్..
ఉత్తరాఖండ్ సొరంగం కుప్పకూలిన ఘటనలో 41 మంది లోపల చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ నేటితో 16వ రోజుకు చేరుకుంది. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కూలిపోయింది. ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడానికి ప్రస్తుతం వర్టికల్ డ్రిల్లింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.
సిల్క్యారాలోని కొండపై నిలువు డ్రిల్లింగ్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. మాన్యువల్ డ్రిల్లింగ్‌తో పాటు ఇప్పుడు వర్టికల్ డ్రిల్లింగ్ చేయడంపై దృష్టి పెట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి గ్యాస్ కట్టర్‌తో పాటు ప్లాస్మా కట్టర్‌ను తీసుకొచ్చారు.టన్నెల్‌లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా.. అగర్ యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజీనిరింగ్ బృందం తవ్వి పైపులు వేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం అన్ని శిథిలాలు (అగర్ మెషిన్) తొలగించామని.. బహుశా 3 గంటల తర్వాత మళ్లీ ప్రారంభమవుతుందని మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ చెప్పారు. ఇప్పటివరకు 31 మీటర్ల వరకు వర్టికల్ డ్రిల్లింగ్ జరిగిందని వెల్లడించారు.కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ సంధు, ప్రమోద్ కుమార్ మిశ్రాతో కలిసి సొరంగం లోపల జరుగుతున్న పనులను పరిశీలించారు.

సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు పంపిన ఆహార పదార్థాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరా తీశారు. చిక్కుకున్న కార్మికులు, వారి కుటుంబాలతో పీకే మిశ్రా మాట్లాడారు. ఉత్తరాఖండ్ సొరంగం కుప్పకూలిన రెస్క్యూ ఆపరేషన్‌లలో వర్షం కొత్త సవాలుగా మారవచ్చని చెబుతున్నారు. వర్షం వల్ల వర్టికల్ డ్రిల్లింగ్‌కు ఆటంకం కలిగుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications