Uttarakhand Tunnel Collapse: వేగంగా సాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్.. నేడు కార్మికులను బయటకు తీసుకొచ్చే అవకాశం..!
ఉత్తరఖాండ్ లో సొరంగం కూలిన ఘటనలో గత 12 రోజులుగా 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సిల్క్యారా సొరంగంలో రెస్క్యూ పని చివరి దశకు చేరుకుంది. సొంగంలో చిక్కుకుపోయిన కార్మికుల రక్షణ కోసం దేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 800 మిమీ వ్యాసం కలిగిన ఉక్కు పైపులు వారి సమీపంలోకి చేరుకోవడంతో చిక్కుకున్న కార్మికులను రక్షించే ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం రాత్రి నుంచి అమెరికన్ ఆగర్ యంత్రంతో తిరిగి చేపట్టిన పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 800 మి.మీ. వ్యాసార్ధం ఉన్న స్టీలుపైపులను భూమికి సమాంతరంగా శిథిలాల ద్వారా 45 మీటర్ల మేర ప్రవేశపెట్టగలిగారు. ఇలాంటి పైపులు మరో 12 మీటర్ల దూరం వెళ్తే వాటి ద్వారా కూలీలు సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
అయితే 12 మీటర్లలో 10 మీటర్లు క్లిష్టతరమైనదిగా పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా శిథిలాలకు రెండోవైపున్న బార్కోట్ నుంచి కూడా 8 మీటర్ల వరకు తవ్వకాలు పూర్ తిచేశారు. దీనికోసం మూడుసార్లు పేలుళ్లు కూడా నిర్వహించారు. ఈ ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని భావిస్తున్నప్పటికీ, "సాంకేతిక లోపాలు, సవాలుగా ఉన్న హిమాలయ భూభాగం, ఊహించని అత్యవసర పరిస్థితుల కారణంగా సమయపాలన మారవచ్చు" అని ప్రభుత్వం తెలిపింది.

ఈ స్క్యూ ఆపరేషన్ ను నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ కు కల్నల్ దీపక్ పాటిల్ నాయకత్వం వహిస్తున్నారు. 41 మంది కార్మికులను రక్షించడానికి ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ వద్ద 12 మీటర్ల పైప్‌లైన్ వేయడం ఇంకా మిగిలి ఉందని ఆయన చెప్పారు. శిథిలాలలో నిక్షిప్తమై ఉన్న స్టీల్ రాడ్లను సిబ్బంది కత్తిరించి తొలగించారని పేర్కొన్నారు "చివరి పైపు ముందు భాగం పాడైందని.. కోత పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు జాయింట్లు కలపాలి 6 గంటలు పడుతుందని వివరించారు.
సొరంగం మధ్యలో 11 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను బయటకు తీసుకురావాలంటే అడ్డుగా ఉన్న శిథిలాలను పిండిచేయాలని తెలిపారు. పనులు ఆశావహంగా సాగుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ చెప్పారు. మధ్యలో ఎలాంటి అవాంతరం రాకుంటే కొన్ని గంటల్లోనే శుభవార్త వింటామన్నారు. మరోవైపు సొరంగంలో ఉన్న వారికి ఆహారం, ఔషధాలు, పానీయాలు పంపించడానికి ఏర్పాటు చేసిన మరో గొట్టపు మార్గం ద్వారా మైక్రోఫోను, స్పీకరును కూడా కూలీల వద్దకు పంపారు. దీంతో వారి మాట్లాడతున్నారు. వారికి బట్టలు, పేస్టులు, సబ్బులు కూడా పంపారు.












Click it and Unblock the Notifications