జిహాద్ కాదు.. హత్యలు: ఐసిస్‌పై అసదుద్దీన్, బీజేపీ సీఎంకు లేఖ, షాకిచ్చిన శివసేన

ముంబై: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల పైన హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బుధవారం మండిపడ్డారు. ఐసిస్ చేసే హింస జిహాద్ కానే కాదని, అవి కరడుగట్టిన హంతకులు చేసే హత్యలని అసద్ అన్నారు.

ముస్లీం యువత సిరియా ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా ఉండేందుకు అనుభవజ్ఞులైన ముస్లీంలు వారికి మార్గదరశకం చేయాలన్నారు. బుధవారం ఆయన పుణేలో విలేకరులతో మాట్లాడారు. అందరినీ కలుపుకొని అందరి అభివృద్ధి కోసం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే, కొన్ని నెలల్లోనే దాని అసలు స్వరూపం బయటపడిందన్నారు.

Reservations for Muslims need of the hour: Asaduddin Owaisi

మరఠా రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదన్నారు. మహారాష్ట్రలోని ముస్లీం సమాజం అభివృద్ధికి వచ్చే ఆర్థిక బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాసినట్లు అసద్ తెలిపారు. ముస్లీం యువకులకు ఉద్యోగం, చదువు కావాలన్నారు.

కాగా, పుణేలోని గోలిబార్ మైదానంలో ముస్లీం రిజర్వేషన్ల పరిషత్ సభలో అసద్ మాట్లాడాల్సి ఉండె. కానీ ఓవైస సభను అడ్డుకుంటామని శివసేన అధ్యక్షులు బాల్ థాకరే హెచ్చరించారు. మొదట సభను నిరాకరించిన పోలీసులు.. అనంతరం కొన్ని షరతులతో అంగీకరించారు. సమావేశం హాలు బయట శివసేన నిరనస వ్యక్తం చేయడంతో మజ్లిస్ నేతలు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+