3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల నాలుగు ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్‌పై భారీ జరిమానాలు విధించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో ఈ వివరాలను స్పష్టం చేసింది. యూనియన్ బ్యాంక్‌కు ₹95.40 లక్షలు, సెంట్రల్ బ్యాంక్‌కు ₹63.60 లక్షలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ₹58.50 లక్షల చొప్పున జరిమానాలు పడ్డాయి. పైన్ ల్యాబ్స్‌పై ₹3.10 లక్షల పెనాల్టీ విధించినట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అనధికార ఎలక్ట్రానిక్ లావాదేవీల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కొంతమంది ఖాతాదారుల అకౌంట్లలో, లావాదేవీలు జరిగిన 10 పని దినాలలోగా తిరిగి డబ్బులు జమ చేయడంలో విఫలమవడంతో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించింది. అంతేకాకుండా, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) అకౌంట్ల సిస్టమ్ ఆధారిత అసెట్ క్లాసిఫికేషన్ ప్రక్రియలో కూడా నిబంధనలను బ్యాంక్ పాటించలేదు.

reserve-bank-of-india-penalties-to-3-government-banks-for-violations-on-four-financial-instructions

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలు పాటించనందుకు జరిమానా పడింది. నిర్దిష్ట గడువులోగా కొందరు కస్టమర్ల కేవైసీ రికార్డులను సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీకి అప్‌లోడ్ చేయడంలో బ్యాంక్ విఫలమైంది. కొన్ని సందర్భాల్లో, ఖాతాదారులకు ఇప్పటికే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు (BSBD) ఉన్నప్పటికీ, వారికి మళ్లీ అవే ఖాతాలను తెరిచింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అతిక్రమించినట్లు కేంద్ర బ్యాంకు పేర్కొంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొన్ని ప్రాధాన్య రంగ రుణ ఖాతాలపై అనధికారికంగా యాడ్-హాక్ సర్వీస్ ఛార్జీలు, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేసినందుకు జరిమానా విధించారు. అంతేకాకుండా, గడువు ముగిసిన టర్మ్ డిపాజిట్ రసీదులకు (TDRలు) సంబంధించి తిరిగి చెల్లించాల్సిన వడ్డీని కూడా కొంతమంది కస్టమర్లకు చెల్లించడంలో బ్యాంక్ విఫలమైంది. ఈ ఉల్లంఘనల కారణంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.

ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్‌పై విధించిన జరిమానాకు కారణం, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) హోల్డర్ల కోసం కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలంకావడమే. ఈ లోపాన్ని గుర్తించిన కేంద్ర బ్యాంకు చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+