వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక విషయాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ!

వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగమైన 'మాదకద్రవ్య రహిత యువజన ఉద్యమం' దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 138 వ ఎపిసోడ్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మై భారత్ వాలంటీర్లు, NSS, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యంతో ఈ 100 వారాల ఉద్యమం ముమ్మరంగా సాగుతోందన్నారు.

యువత తమ సొంత భాషల్లో, వీధి నాటకాలు, గీతాలు, సామాజిక మాధ్యమాలలో DrugFreeYouth ప్రచారాల ద్వారా సృజనాత్మకంగా అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ మొదటి దశ దాదాపుగా పూర్తయ్యిందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

PM Modi Drug-Free Youth Movement Expanding Rapidly Under Viksit Bharat Vision modi says key issues

దేశంలోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ -కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని మంచు ప్రాంతాల్లోనూ ఈ సేకరణ సాగుతోందన్నారు. ప్రజలు జనగణన వెబ్‌సైట్ ద్వారా తమ ఫోన్ల నుంచే 16 భాషల్లో 'స్వీయ-నమోదు' చేసుకోవచ్చని చెప్పారు. 'పోషకాహార మాసం' సందర్భంగా సెప్టెంబర్ నెలలో పోషకాహార లోపంపై జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 'హర్ ఘర్ మునగ', గుజరాత్‌లో చిరుధాన్యాల వంటకాల పోటీలు, మహారాష్ట్రలో అంగన్‌వాడీల అవగాహన, మిజోరంలో 'తలో-మడ్-యనా' సంప్రదాయంతో పోషకాహార తోటల పెంపకం వంటి ప్రశంసనీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో 9 కోట్ల మంది లబ్ధిదారులతో అంగన్‌వాడీ కేంద్రాలు 'పోషణ్ ట్రాకర్' డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమయ్యాయని తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని పార్టీలకు బిగ్ టాస్క్.. పట్టభద్రులపై పట్టు ఎవరికో!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని పార్టీలకు బిగ్ టాస్క్.. పట్టభద్రులపై పట్టు ఎవరికో!

అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన అందించిన 'పరిశుభ్రత' అనే జీవన మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వచ్ఛత కోసం దేశంలో యువత చేపడుతున్న చొరవలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మధ్యప్రదేశ్‌లో నదీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచీన మెట్ల బావుల పునరుద్ధరణ, ముంబైలో బీచ్‌ల శుభ్రత, ఢిల్లీలో చెత్త వేరుచేసే అవగాహన, పశ్చిమ బెంగాల్‌లో పిక్నిక్ ప్రాంతాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+