ఫలితాలపై అమిత్, శివసేనపై ఇలా.., కష్టపడ్తాం: రాహుల్

న్యూఢిల్లీ/హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల పైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన మంచి పనుల వల్లనే రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందన్నారు. మోడీ పాలన తీరుపై ప్రజలు ఆలోచించారన్నారు. ఈ విజయం ప్రజలదే అన్నారు.

కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న తమ ప్రచారం ఫలించిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్నారు. రెండు రాష్ట్రాల్లోను మూడో స్థానానికి పడిపోయిందని విమర్శించారు. బీజేపీని ఆధరించిన ఇరు రాష్ట్రాల ప్రజలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. మోడీ చేసిన మంచి పనుల వల్లనే తమకు పట్టం గట్టారన్నారు.

హర్యానాలో గత ఎన్నికల్లో నాలుగు స్థానాలే గెలిచామని, ఈసారి 47 స్థానాలు గెలుచుకున్నామని షా అన్నారు. మహారాష్ట్రలో 122 స్థానాలతో అన్ని పార్టీలకంటే ముందున్నామన్నారు. మహారాష్ట్రలో 22 శాతం ఓట్లు సాధించామన్నారు.

Results a vindication of Modi's policies, Amit Shah says

శివసేనపై వివరణ

శివసేనతో ఎన్నో ఏళ్ల నుండి ఉన్న తమ అనుబంధాన్ని తాము తెంచుకోలేమన్నారు. తమకు మూడు సీట్ల విషయంలోనే పొత్తు కుదరలేదని తెలిపారు. మహారాష్ట్రలో తమకు ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రెండు రాష్ట్రాల్లోను సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. ఇది పార్టీ, ప్రజలు, కార్యకర్తల విజయమన్నారు. బీజేపీ అద్భుత విజయం సాధించిందన్నారు.

మరింత కష్టపడతాం: రాహుల్ గాంధీ

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తాము మరింత కష్టపడి ప్రజల అభిమానం చూరగొంటామని తెలిపారు. మహారాష్ట్రలో పదిహేనేళ్ల పాలన మారాలని కోరుకున్నారని, హర్యానాలో మార్పు కోసం ప్రజలు ఓటేశారన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు.

ప్రజల తీర్పు శిరసా వహిస్తాం: సోనియా గాంధీ

హర్యానా, మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్నారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు: కిషన్ రెడ్డి

కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. రెండు రాష్ట్రాల్లో మంచి పాలన అందించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు.

రాష్ట్ర నాయకత్వాన్ని తప్పు పట్టిన అశోక్ చవాన్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎన్నికల ఫలితాల పైన ఆదివారం స్పందించారు. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోవడంపై ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టారు. రాష్ట్ర్లంలో ఎలాంటి మోడీ వేవ్ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+