తెలంగాణ రిటైర్డ్ ఐఎఎస్‌కు కేంద్రంలో కీలక పదవి ఇచ్చిన ప్రధాని మోదీ..!!

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి హీరాలాల్ సామరియాకు కేంద్రంలో కీలక పదవి లభించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఏర్పాటైన కమిటీ హీరాలాల్ సామరియా పేరును ఎంపిక చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి వీకే తివారీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంది రామలింగం‌ను సమాచార కమిషనర్లుగా నియమించింది.

Retired IAS from Telangana, Heeralal Samariya takes oath as CIC

1985 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి హీరాలాల్ సామరియా. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు అలాట్ అయ్యారు. పలు కీలక పదవుల్లో పని చేశారు. ఉమ్మడి ఏపీలో గుంటూరు కలెక్టర్‌గా, సదరన్ డిస్కం, ట్రాన్స్‌కో సీఎండీగా, ఎక్సైజ్, వాణిజ్య పన్ను శాఖల కమిషనర్‌గా పలు హోదాల్లో ఆయన పని చేశారు.

Retired IAS from Telangana, Heeralal Samariya takes oath as CIC

రిటైర్ అయ్యే సమయానికి తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయనను కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎంపిక చేసింది మోదీ నేతృత్వంలోని కమిటీ. ఇదివరకు ఇక్కడే కమిషనర్ స్థాయిలో సేవలందించారు. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని చీఫ్ కమిషనర్‌గా అపాయింట్ చేసింది కేంద్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+