వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనిమనిషిపై రిటైర్డ్ ప్రొఫెసర్,అతని స్నేహితుడి గ్యాంగ్ రేప్... ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి...

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ పనిమనిషిపై రిటైర్డ్ ప్రొఫెసర్,సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆమె స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలను అడ్డుపెట్టుకుని గత కొన్నాళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇన్నాళ్లు ఆమె నోరు మూయించారు. బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం... శివనారాయణ్ పాండే(60) అనే ఓ వ్యక్తి ఫాంహౌస్‌లో ఓ వివాహిత మహిళ(38) పనిచేస్తోంది. శివనారాయణ్ పాండే ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి యజమాని. ఆ పనిమనిషి భర్త గతంలో శివనారాయణ్ నిర్వహిస్తున్న ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఆమెపై కన్నేసిన శివనారాయణ్ ఓరోజు ఆమె బట్టలు మార్చుకుంటుండగా రహస్యంగా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.

retired professor and his friend raped maid in madhya pradesh

అప్పటినుంచి ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో గత ఆదివారం శివనారాయణ్ పాండే స్నేహితుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ దేవేంద్ర పాండే అతని ఫాంహౌస్‌కి వచ్చాడు. ఆ సమయంలో శివనారాయణ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటం గమనించాడు. అప్పటి నుంచి అతనూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇలా శివనారాయణ్ పాండే,దేవేంద్ర పాండే ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నారు.

ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు. ఇటీవల ఆమె తన భర్తకు అసలు విషయం చెప్పి... అతని సహాయంతో రతీబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనపై ఎస్ఐ ప్రేక్ష మౌర్య మాట్లాడుతూ... సదరు రిటైర్డ్ ప్రొఫెసర్‌ను శివనారాయణ్ పాండే గొప్ప కవిగా ఆమెకు పరిచయం చేశాడని చెప్పారు. మొదట శివనారాయణ్ పాండే... ఆ తర్వాత దేవేంద్ర పాండే... బ్లాక్‌మెయిల్‌ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పారు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని... నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Recommended Video

Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

గడిచిన నాలుగైదేళ్లలో మధ్యప్రదేశ్‌లో 26,708 రేప్ కేసులు,37 హత్యాచార కేసులు,27,827 మైనర్ బాలికల కిడ్నాప్ కేసులు,853 మహిళల కిడ్నాప్ కేసులు,2663 హత్య కేసులు నమోదైనట్లు క్రైమ్ డేటా చెబుతోంది. ఈ గణాంకాలను రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు.

English summary
A retired professor and his friend raped a maid in Madhya Pradesh. She has been sexually assaulted since last year by blackmailing her with some secretly shooted bathing videos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X