Revenge: భార్య దూరం, మహిళతో అక్రమ సంబంధం, అర్దరాత్రి నరికి చంపిన 22 మంది, ఫ్రెండ్స్ ఎస్కేప్ !
పంచకుల/ హర్యానా/ చెన్నై: హత్య కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాడు. భార్యకు దూరంగా ఉంటున్న అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేరచరిత్ర ఉన్న ఇతను నిత్యం కొందరు అనుచరులను వెంటపెట్టుకుని తిరుగుతున్నాడు. రాత్రి హోటల్ లో అనుచరులతో కలిసి భోజనం చేసిన అతను తరువాత బయటకు వచ్చి కారులో బయలుదేరాడు. అదే సమయంలో రెండు కార్లు, నాలుగు బైకుల్లో వచ్చిన వ్యక్తులు అతని కారును అడ్డగించి కారు అద్దాలు మొత్తం ద్వంసం చేశారు. కారులో ఉన్న ఇద్దరు అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. 22 మంది వ్యక్తులు కత్తులు, వేటకోడవళ్లు తీసుకుని నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేసి అక్కడి నుంచి దర్జాగా అక్కడి నుంచి పారిపోవడం కలకలం రేపింది.

పేరుమోసిన రౌడీషీటర్
హర్యానాలోని పంచకుల ప్రాంతం సమీపంలోని పింజోర్ లో రింకూ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2017లో జరిగిన హత్య కేసులో రింకూ జైలుకు వెళ్లాడు. కొన్ని నెలలపాటు జైల్లో ఉన్న రింకూ బెయిల్ మీద బయటకు వచ్చాడు. రింకూకు నేరచరిత్ర ఎక్కువగా ఉంది. రౌడీషీటర్ గా గుర్తింపు తెచ్చుకున్న రింకూకు శత్రువులు కూడా చాలా మంది ఉన్నారు.

భార్య దూరం..... రౌడీకి అక్రమ సంబంధం
హత్య కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చిన రింకూ అతని భార్యకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నాడు. రింకూ ఇప్పుడు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేరచరిత్ర ఉన్న రింకూ ప్రతినిత్యం కొందరు అనుచరులను వెంటపెట్టుకుని కారులో తిరుగుతున్నాడు.

అనుచరులతో హోటల్ కు వెళ్లాడు
రాత్రి రింకూ అతని అనుచరులతో కలిసి జిరక్ పూర్ లోని మమతా ఎన్ క్లేవ్ లోని హోటల్ కు వెళ్లాడు. రాత్రి 11. 30 గంటల సమయంలో అనుచరులతో కలిసి భోజనం చేసిన తరువాత రింకూ బయటకు వచ్చి కారులో బయలుదేరాడు. తరువాత మజ్రీచౌక్ సమీపంలోని బస్ స్టాండ్ దగ్గర సిగరెట్లు తీసుకోవడానికి కారు నిలిపారు.

నరిరోడ్డులో నరికి చంపేశారు
రింకూ కారులో ఉన్న సమయంలో రెండు కార్లు, నాలుగు బైకుల్లో వచ్చిన వ్యక్తులు అతని కారును చుట్టుముట్టి కారు అద్దాలు మొత్తం ద్వంసం చేశారు. రింకూతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు కిందకు దిగి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రింకూ కిందపడిపోయాడు. కిందపడిన రింకూను సుమారు 24 మంది వేటకోడవళ్లు, కత్తులు తీసుకుని అతన్ని దారుణంగా నరికిచంపేశారు.

20 సార్లు నరికేసి ముక్కలు చెయ్యాలని ప్రయత్నం
రింకూ అనుచరులు సమీపంలోని ఖార్క్ మంగోలిలోని మురికివాడలో అర్దగంటసేపు తలదాచుకుని తరువాత వచ్చి చూశారు. అప్పటికే రింకూను ఇష్టం వచ్చినట్లు నరికి చంపేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రింకూను 20 సార్లుకు పైగా నరకడంతో అతని శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపోయాయని, పాతకక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని స్థానిక పోలీసు అధికారి మహాబీర్ సింగ్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. ముందు జాగ్రత్తగా రింకూ, అతని ప్రత్యర్థులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేశారు. నడిరోడ్డు మీద రౌడీషీటర్ ను అంతమంది నరికి చంపడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications