లేడీ డాన్‌లా.. గన్ గురిపెట్టి వరుడి కిడ్నాప్ చేసిన యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో పెళ్లి జరుగుతుండగా ఓ యువతి ఇద్దరు వ్యక్తులతో వచ్చి, తుపాకీతో బెదిరించి వరుడిని తీసుకు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది.

అతను (వరుడు) నన్ను ప్రేమించాడని, ఇప్పుడు మోసం చేసి ఇక్కడ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని, తాను ఊరుకునేది లేదని చెబుతూ సదరు యువతి అతనిని తీసుకెళ్లింది.

ఆ యువతి ఓ వాహనంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి లేడీ డాన్‌లా దిగింది. దర్జాగా తుపాకీ పట్టుకుని మండపంలోకి వెళ్లింది. దానిని వరుడికి గురి పెట్టింది. దాంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు.

Revolver Rani In Uttar Pradesh Stops Wedding, Kidnaps Groom

బుందేల్‌ఖండ్‌కి చెందిన అశోక్‌కు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కొద్దిసేపట్లో వీరి వివాహం జరగాల్సి ఉండగా ఆ యువతి ఇధ్దరు మనుషులతో వచ్చి బీభత్సం సృష్టించింది.

తనని ప్రేమించి, వివాహం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది. ఆమె ఎవరో తెలియదని అశోక్‌ ఎంత వేడుకున్నా వినిపించుకోకుండా అతనికి తుపాకీ గురిపెట్టి మండపం నుంచి తీసుకెళ్లిపోయింది. దాంతో అశోక్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాబోయే భర్తను తీసుకెళ్లిపోయిందన్న బాధతో వధువు కన్నీరుమున్నీరైంది. అశోక్‌పై ముందు నుంచి అనుమానంగానే ఉందని, పని చేస్తున్న ప్రాంతానికి వస్తానంటే రానిచ్చేవాడు కాదని అంటున్నారు. స్థానికులు కూడా అశోక్‌ మహిళను మోసం చేసి వేరే వివాహం చేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The young woman was accompanied by about two young men, who abducted the groom from the mandap or altar and drove away with their hostage on late on Tuesday night.
Please Wait while comments are loading...