దునియాలో ధనికమైన గ్రామం: ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు.. ఎక్కడ అంటే
దునియాలో అత్యంత సంపన్నమైన గ్రామం గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే ఓకే.. ధనికమైన గ్రామం అంటే సాధారణంగా అమెరికా లేదంటే బ్రిటన్, ఫ్రాన్స్ దేశంలో పేరు చెబుతారు. మన దేశంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఉంది. అవును మీరు చదువుతుంది నిజమే. ఈ గ్రామంలో 7,600 నివాసాలు ఉన్నాయి. గ్రామంలో ప్రజలు డబ్బు దాచుకోవడానికి 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి.

రూ.500 కోట్లు డిపాజిట్
బ్యాంకులో వారు 5,000 కోట్ల రూపాయల డిపాజిట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో మధాపర్ గ్రామం ఉంది. గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ సుమారు 15 లక్షల రూపాయలు. గ్రామంలో 17 బ్యాంకులు మాత్రమే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, సరస్సులు, పచ్చదనం, ఆనకట్టలు, ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి. గ్రామంలో అత్యాధునిక గౌశాల కూడా ఉంది. దేశంలోని సంప్రదాయ గ్రామాల కంటే ఎందుకు భిన్నంగా ఉంది అంటే?. దీనికి ప్రధాన కారణం గ్రామస్థుల కుటుంబ సభ్యులు, బంధువులలో ఎక్కువ మంది యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలు వంటి విదేశాలలో నివసిస్తున్నారు.

65 శాతం మంది ఎన్ఆర్ఐ
65% కంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు దేశం వెలుపల నుంచి తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతున్నారు. ఆ గ్రామ ఎన్ఆర్ఐలలో చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత దేశానికి తిరిగి వచ్చి గ్రామంలో తమ వెంచర్లను ప్రారంభించారు. కొన్ని నివేదికల ప్రకారం, మాధపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను 1968లో లండన్ లో ఏర్పాటు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న మాధపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రజల మధ్య మంచి సంబందాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇలాంటి ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు.

మూలాలను మరవలే..
చాలామంది గ్రామస్థులు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వారు తమ మూలాలను ఎన్నడూ మారిచిపోలేదు. వారు నివసిస్తున్న దేశం కంటే గ్రామ బ్యాంకుల్లో తమ డబ్బును ఆదా చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం ఇప్పటికీ ఇక్కడ ప్రధాన వృత్తిగా ఉంది. అందుకే మధాపర్ గ్రామం ప్రపంచలో అత్యధిక సంపద కలిగిన గ్రామంగా నిలిచింది. ఇక్కడి ప్రజలు సోదరభావంతో.. ప్రేమతో మెలుగుతూ.. ఊరినే అత్యంత సంపద కలిగిన గ్రామంగా తీర్చిదిద్దగలిగారు.












Click it and Unblock the Notifications