వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్‌లో రిషి కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు: 'ఆవు మాంసం తినే హిందువుని నేను'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: 1980ల్లో బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగొందిన హీరో రిషి కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. తినే తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారో తనకి అర్ధం కావడం లేదన్నారు. ఆవు మాంసం తినే హిందువునని ఆయన ప్రకటించుకున్నారు.

ఆవు మాంసం తినే వారికి భక్తి ఉండదనా, తినని వారికి దేవుడంటే భక్తి ఉంటుందనా అర్ధం అంటూ ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాకు కోపంగా ఉంది. ఆహారాన్ని మతంతో ఎందుకు పోలుస్తారు? నేను బీఫ్ (ఆవు మాంసం) తినే హిందువును. అందువల్ల దేవుడంటే నాకు భయంలేదనా? ఆలోచించండి" అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

రిషి కపూర్ చేసిన వ్యాఖ్యలకు పెను దుమారం చెలరేగింది. ఆయనపై పెద్ద ఎత్తు విమర్శలు చేశారు. వాటికి సమాధానాలు ఇవ్వలేక రిషి కపూర్ ఇబ్బందులు పడుతున్నారు. "నా మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఆవులను చంపానని ఎప్పుడు చెప్పాను? నేను ఆవు మాంసం తింటాను. ఇండియాలో కాదు. దాన్ని ఆహారంగా వినియోగించే చోట" అని వివరణ ఇచ్చారు.

గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడైనా ఆవ మాంసాన్ని విక్రయించినా లేగా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 50 వేలు జరిమానా విధించనున్నారు. అందుకు సంబంధించిన చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

గోవధ నిషేధంపై మహారాష్ట్ర మాదిరే హర్యానాలో కూడా విధించింది. హర్యానా రాష్ట్రంలో గోవధ చేసే వారికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన బిల్లుని గత వారంలో హర్యానా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాన్ని రిషి కపూర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

English summary
Rishi Kapoor tweets he is a beef-eating Hindu, lands in Twitter controversy Much loved Bollywood actor Rishi Kapoor on Sunday, March 15, took to the social networking site Twitter to post that he is a beef-eating Hindu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X