కాశ్మీర్ లో భీభత్సం సృష్టించే ప్రమాదం ; ఆఫ్ఘనిస్థాన్ నుండి కాశ్మీర్ తో పాటు రష్యాకు ముప్పు : రష్యన్ రాయబారి

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాద దేశంగా, ఉగ్రవాద తయారీ కర్మాగారంగా మారుతుందా అన్న అనుమానాలు ప్రపంచ దేశాల్లో వ్యక్తం అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశం ఆఫ్ఘనిస్థాన్ విషయంలో మొదటి నుంచి ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భారతదేశం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల తాలిబన్ నాయకులతో జరిపిన చర్చల్లో కూడా ఆఫ్ఘనిస్థాన్ ను ఏ విధమైన ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూడాలని పేర్కొంది. కానీ భారత ప్రభుత్వ ఆందోళన నిజమయ్యేలా కనిపిస్తుందని తాజా పరిణామాలతో అర్థమౌతుంది.

కాశ్మీర్ లో ఉగ్రవాదం వ్యాప్తి చెందే ప్రమాదం : రష్యన్ రాయబారి

కాశ్మీర్ లో ఉగ్రవాదం వ్యాప్తి చెందే ప్రమాదం : రష్యన్ రాయబారి

మొన్నటికి మొన్న ఒక తాలిబన్ నాయకుడు ముస్లింల హక్కుల కోసం కాశ్మీర్లో అయినా సరే తమ గళాన్ని వినిపిస్తామని చేసిన వ్యాఖ్యలు మరిచిపోకముందే, తాజాగా రష్యా రాయబారి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.ఆఫ్ఘనిస్థాన్లో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా తోపాటు భారతదేశంలో ఉమ్మడి ఆందోళన నెలకొందని రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాజా పరిణామాలతో చిక్కుల్లో ఉన్నామన్న రష్యన్ రాయబారి, రష్యన్ భూభాగంతో పాటు కాశ్మీర్‌లో కూడా ఉగ్రవాదం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, భారతదేశం మరియు రష్యా ఏవైనా ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడాన్ని కొనసాగిస్తాయని పేర్కొన్నారు. .

 రష్యా, భారత్ లు ఆఫ్ఘనిస్థాన్ తాజా పరిణామాలపై సంప్రదింపులు

రష్యా, భారత్ లు ఆఫ్ఘనిస్థాన్ తాజా పరిణామాలపై సంప్రదింపులు

రష్యా రాయబారి కుడాషేవ్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్లో భద్రత, స్థిరత్వం తో పాటు, భవిష్యత్తును ఊహించటానికి అవకాశం ఇచ్చే ఏకైక ప్రభుత్వాన్ని రష్యా కోరుకుంటుందని, కాబూల్‌లో ప్రస్తుత కొత్త పాలనను గుర్తించడం పై తక్షణ దృష్టి తమకు లేదని వెల్లడించారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ పై భారత్ మరియు రష్యా మధ్య సహకారం కోసం తమకు తగినంత అవకాశం ఉంది అని రష్యా ప్రతినిధి చెప్పారు. అంతేకాదు యుద్ధంలో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తాజా పరిణామాలపై ఇరుపక్షాలు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు.

రష్యా , భారత్ రెండు దేశాలకూ ఒకే విధమైన సమస్య

రష్యా , భారత్ రెండు దేశాలకూ ఒకే విధమైన సమస్య

ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై భారత్ మరియు రష్యా రెండూ ఆందోళన చెందుతున్నాయి. మేము అందరినీ కలుపుకొని ఉండే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఆఫ్ఘన్ భూభాగం ఇతర దేశాలలో భీభత్సానికి మూలం కాకూడదని మేము కోరుకుంటున్నాము అని కుడాషేవ్ అన్నారు. రష్యా మరియు భారతదేశాన్ని కలిపే ప్రాథమిక విలువలు ఇవని పేర్కొన్న ఆయన ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఇరుదేశాల వైఖరిలో నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు అని వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ నుండి రష్యాకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం గురించి రష్యా ఆందోళన చెందుతుందా అని అడిగినప్పుడు, రాయబారి "ఖచ్చితంగా" అని అన్నారు. పౌర సంఘర్షణ ఏదైనా పెరిగితే ప్రాంతీయ భద్రతకు హానికరం అని కూడా ఆయన పేర్కొన్నారు.

 కాశ్మీర్ భూ భాగంలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందన్న రష్యన్ రాయబారి

కాశ్మీర్ భూ భాగంలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందన్న రష్యన్ రాయబారి

తాలిబన్ల ఉగ్రవాద కార్యకలాపాల విషయానికొస్తే, రష్యన్ భూభాగం మరియు కాశ్మీర్ భూభాగంలో భీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని , ఇది ఇరు దేశాలకు ఆందోళన కలిగించే విషయం అని కుడాషేవ్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుండి పనిచేస్తున్న వివిధ ఉగ్రవాద గ్రూపులు యుద్ధంలో చిక్కుకున్న దేశం నుండి దృష్టిని మరల్చే అవకాశంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆఫ్ఘనిస్థాన్ లో పనిచేస్తున్న వివిధ ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం మరియు ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందా అని అడిగినప్పుడు అవకాశం లేకపోలేదు అని చెప్తూనే, ఆఫ్ఘనిస్థాన్ లో సురక్షితమైన వాతావరణాన్ని చూడాలనుకునే దేశాలలో పాకిస్తాన్ ఉండాలని రష్యా ఆశిస్తోందని, అలా కాకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా కూడా షేవ్ పేర్కొన్నారు

 ఆఫ్ఘనిస్థాన్ నుండి వివిధ ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు భారత్ కు ఇబ్బందే

ఆఫ్ఘనిస్థాన్ నుండి వివిధ ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు భారత్ కు ఇబ్బందే

తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి లష్కరే తోయిబా మరియు జైష్-ఇ-మొహమ్మద్‌తో సహా వివిధ ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున భారతదేశంలో ఆందోళనలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ దోహాలో సీనియర్ తాలిబాన్ నాయకుడు షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్‌ని కలిశారు. సమావేశంలో, మిట్టల్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలు మరియు ఉగ్రవాదం కోసం ఉపయోగించరాదని స్టానెక్‌జాయ్‌కు తెలియజేశారు. ఇరుపక్షాల మధ్య అధికారికంగా జరిగిన మొదటి సమావేశం ఇది.

Recommended Video

    Talibans వ్యాఖ్యలపై భారత్ ఫైర్.. ముందు చైనా సంగతి చూస్కోండి!! || Oneindia Telugu
    ఉగ్రవాదంపై భారత్, రష్యాలు కలిసి ముందుకు సాగుతాయన్న రష్యన్ రాయబారి

    ఉగ్రవాదంపై భారత్, రష్యాలు కలిసి ముందుకు సాగుతాయన్న రష్యన్ రాయబారి

    యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో సుస్థిర అభివృద్ధిని నిర్ధారించగల ఆఫ్ఘనిస్తాన్‌లోని సమగ్ర ప్రభుత్వం కోసం మేం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఆఫ్ఘన్ ప్రజలు శాంతి, స్థిరత్వం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే పొందాలి అని కుడాషేవ్ అన్నారు. అందుకు భిన్నంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగితే దీటుగా ఎదుర్కొంటామని, దానికి కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+