వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రబ్రీ భవన్ నిర్మించినా... ఆర్జేడీ కార్యాలయం అద్దె రూ.333

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ ఐటీవో ప్రాంతంలో సువిశాలమైన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. వీపీ హౌస్‌లో ధతి తక్కువగా బటయరం కొ.333 అద్దె చెల్లిస్తున్న కార్యాలయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇంకా కొనసాగిస్తోంది.

సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్ స్పందిస్తూ... వీపీ హౌస్‌లోని 13వ నెంబరులోని రెండు గదుల వరుసను 2001 మే 23న ఆర్జేడీకి కేటాయించామని తెలిపారు. అందులో వారు 2001 జూన్ 1న ప్రవేశించారని చెప్పారు.

RJD continues to occupy office at Rs 333 per month

ఇందుకోసం నెలకు రూ.333 అద్దె చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖ ఐటీవో ప్రాంతంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గంలోని ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మూడంతస్థుల రబ్రీ భవన్‌ను 2008లో ప్రారంభించి, 2010లో ఆ పార్టీ పూర్తి చేసింది.

కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా పార్టీలకు ఇలా రెండు కార్యాలయాల చొప్పున ఉన్నాయని సమాచార హక్కు చట్ట దరఖాస్తు దారుడు సుభాష్ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆర్జేడీ అదినేత ఆయన భార్య పేరు పైన భవనం నిర్మించాక కూడా పాత భవనంలో కొనసాగుతున్నారని, కొత్త భవనాన్ని ఖాళీగా ఉంచారన్నారు.

English summary
Notwithstanding its grand headquarters at prime ITO area in the national capital, Lalu Prasad Yadav-led Rashtriya Janata Dal continues to occupy an office in VP House here at a meagre rent of Rs 333 per month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X