వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానమంత్రి మోడీకి తేజస్వీ యాదవ్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

జేడీయూ నేత నితీష్ కుమార్ భారతీయ జనతాపార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ తో చేతులు కలపడంపై ఆ పార్టీ మండిపడుతోంది. ఓటర్ల తీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా 2017లో ప్రధానమంత్రి మోడీ చేసిన ట్వీట్ ను ఆర్జేడీ గుర్తుచేసింది. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం బీహార్ ప్రజలకు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అలవాటుందంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు ఇప్పుడు ఆర్ జేడీ కౌంటర్ ఇచ్చింది.

ఔను సార్.. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. బీహార్ కూడా ఇప్పుడు అదే చేసింది.. భారతీయ జనతాపార్టీ మంత్రులు రాష్ట్రాల్లో బురద జల్లుతున్నారు.. కొందరు (ఆర్ ఎస్ఎస్) కత్తులు, కర్రలు ఊపుతూ వీధుల్లో తిరుగుతున్నారు.. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి బీహార్ దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దేశం ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కూడా ఇదేనని ఆర్ జేడీ పోస్ట్ చేసింది.

RJD recalled Prime Minister Modis tweet in 2017

Recommended Video

కుప్పకూలిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం *Politics | Telugu OneIndia

లాలూ ప్రసాద్ లేకుండా బీహార్ రాజకీయం లేదంటూ ఆయన ఇద్దరు కుమార్తెలు పోస్ట్ చేశారు. తర్వాత కేంద్ర మంత్రి గిరిరాజ్ లాలూజీ మీ ఇంట్లోకి పాము మళ్లీ చొరబడిందంటూ నితీష్ కుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దానికి 2017లో నితీష్ ను ఉద్దేశించి లాలూ చేసిన పోస్ట్ ను టాగ్ చేశారు. నితీష్ కుమార్ పాము లాంటి వ్యక్తి అని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చర్మం మార్చుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. తాజాగా దీనికి కౌంటర్ గా ఆర్జేడీ మోడీ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది. నితీష్ కుమార్ తన రాజకీయ ప్రయాణంలో బీజేపీ, ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నారు. 2015లో ఒకసారి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. మరోసారి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఈ రెండు సమయాల్లోను ఆయన బీజేపీతో తనకున్న పొత్తు బంధాన్ని తెంపుకున్నారు.

English summary
RJD recalled Prime Minister Modi's tweet in 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X