బీహార్ దర్బార్: ఆర్జేడీ ఎంఎల్ఏ మీద కేసు
పాట్నా: బీహార్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే మహాకూటమిలోని ఆర్జేడీ శాసన సభ్యుడు రెచ్చిపోయాడు. ఓ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అక్కడి అధికారిని తీవ్రస్థాయిలో హెచ్చరించి చివరికి చిక్కుల్లో పడ్డాడు.
పోలీసులు సదరు శాసన సభ్యుడి మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భోజ్ పూర్ జిల్లా లోని చార్ పోఖ్రి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) కున్వర్ గుప్తా తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
బర్హరా శాసన సభ నియోజక వర్గం నుంచి సరోజ్ యాదవ్ ఇటివల ఆర్జేడీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈయన చార్ పోఖ్రి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి పోలీసు అధికారి కున్వర్ గుప్తాతో మాట్లాడారు. మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన జంట హత్యల కేసు ఏమైయ్యింది అని ప్రశ్నించారు.

ఇద్దరు హత్యకు గురైతే మీరెందుకు కేసు నమోదు చెయ్యలేదని ప్రశ్నించారు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే తమ పని తాము చేసుకుని వెలుతామని, తరువాత పరిస్థితులు వేరుగా ఉంటాయని ఎంఎల్ఏ సరోజ్ యాదవ్ హెచ్చరించారని జిల్లా ఎస్పీ నవీన్ చంద్ర ఝూ అన్నారు.
స్టేషన్ హౌస్ అధికారి కున్వర్ గుప్తా ఫిర్యాదు మేరకు తాము శాసన సభ్యుడు సరోజ్ యాదవ్ మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్పీ నవీన్ చంద్ర ఝూ వివరించారు. అయితే ఎంఎల్ఏ సరోజ్ యాదవ్ మాత్రం తాను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చెయ్యలేదని అంటున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications