మద్యం తాగించి బాలికపై రేప్: పరారీలో ఎమ్మెల్యే
పాట్నా: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన రాష్ట్రీయ జనతా దళ్ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యేపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాకు చెందిన బాలికపై అత్యాచారం చేసినట్లు నవాడా ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
యాదవ్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ విషయంపై పాట్నా పోలీసు అధికారి షాలిన్ మాట్లాడుతూ.. బాలిక తెలిపిన వివరాలు, ఆధారాల ప్రకారం ఎమ్మెల్యే అత్యాచారం చేసినట్లు రుజువైందని తెలిపారు. ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడని తెలిపిన పోలీసులు.. విచారణ చేపట్టామన్నారు.

బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం... ఫిబ్రవరి 6వ తేదీన సులేఖాదేవి అనే మహిళ బాలికను నలందలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. కాగా, అక్కడ ఆమెకు బలవంతంగా మద్యం తాగించిన రాజ్ బల్లభ్ యాదవ్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికను తీసుకొచ్చినందుకు సులేఖాదేవికి రూ.30వేల నగదు ఇచ్చాడు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని అంతా తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications