మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా .. ఎందుకో తెలుసా ..?
న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు తొలిరోజు హాజరైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ విందు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ రాత్రి ఎంపీలంతా డిన్నర్‌కు రావాలని సూచించారు. అయితే బీహర్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ మాత్రం విందుకు హాజరుకాబోమని తేల్చిచెప్పింది.
నో విందు ..
ఇటీవల బీహర్‌లో మెదడువాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరు పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఎంపీలు విందుకు హాజరుకాబోరని ఆ పార్టీ నేత మిసాభారతి స్పష్టంచేశారు. అయితే విందుకయ్యే వ్యయంతో పిల్లలకు మందులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయొచ్చు కదా అని సూచించారు. మెదడువాపు వ్యాధితో ఇప్పటికే రాష్ట్రంలో 136 మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి ప్రబలితే .. సర్కార్ చేష్టలుడిగి చూసిందే .. తప్ప సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
ఏం చేశారు ...?













Click it and Unblock the Notifications