నిన్న మోడీ: బీజేపీ కొత్త ట్విస్ట్... రజనీకాంత్‌ను కల్సిన ఆర్కే నగర్ అభ్యర్థి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మృతి తర్వాత తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆర్కే నగర్‌లో వివిధ పార్టీలో బరిలో నిలిచాయి. బీజేపీ కూడా గంగై అమరన్‌ను బరిలోకి దింపింది.

గంగై అమరన్ మంగళవారం నాడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. రజనీకాంత్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రజనీకాంత్‌ను కలిశారు.

'సాయం కావాలి, శశికళకు చెక్ చెప్పాలంటే రావాలి': రజనీకాంత్‌కు పిలుపు

RK Nagar BJP candidate Gangai Amaran visits Rajinikanth's house

అప్పుడు ఆయనను బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు జరిగాయి. జయలలిత మృతి తర్వాత బీజేపీ రజనీకాంత్‌ను తమవైపు రప్పించుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అది కుదరలేదు.

ఇప్పుడు ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీలతో పాటు దీపా జయ కుమార్, పన్నీరుసెల్వం వర్గం నేత తదితరులు చాలామంది బరిలో ఉన్నారు.

ఇప్పుడు బీజేపీ ఆర్కే నగర్ అభ్యర్థి గంగై అమరన్ రజనీకాంత్‌ను కలిశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆయన కలిసినట్లుగా కనిపిస్తోంది. రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసిన అనంతరం గంగై అమరన్ మీడియాతో మాట్లాడారు. తనకు రజనీకాంత్ మద్దతు ఉందని ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Today RK Nagar BJP candidate Gangai Amaran visits Superstar Rajinikanth's house and took picture with the actor.
Please Wait while comments are loading...