శశికళ కథ తేలితేనే: ఆర్ కే నగర్ ఉప ఎన్నిక ! చిన్నమ్మకు సినిమా కష్టాలు
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ నియామకం ఎంత వరకు ప్రామాణికం అన్న విషయాన్ని పరిశీలించిన తరువాతే ఆర్ కే నగర్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించాలని ఈసీ భావిస్తోందని తాజాగా వెలుగు చూడటంతో చి
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ కు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ నియామకం ఎంతవరకు చెల్లుతుందనే అంశాన్ని భారత ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోందని సమాచారం.
ఇప్పటి అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో రూ. 89 కోట్ల వరకు ఓటర్లకు పంచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది.

జయలలిత మరణంతో
జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని శశికళ ఆశపడ్డారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.

జైల్లో ఉంటూ అక్క కుమారుడికి పగ్గాలు
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ తన అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రి చేసిన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచే చక్రం తిప్పుతున్నారు.

శశికళకు చెక్ పెట్టిన పన్నీర్ సెల్వం
పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని రెండుగా చీల్చారు. శశికళ నియామకాన్ని రద్దు చెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ కు మనవి చేసింది. అంతకు ముందే అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సైతం శశికళ నటరాజన్ నియామకం చెల్లదని, ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.

శశికళ కథ తేల్చిన తరువాతే ఆర్ కే నగర్ ఉప ఎన్నిక
శశికళ నియామకం ఎంత వరకు ప్రామాణికం అన్న విషయాన్ని పరిశీలించిన తరువాతే ఆర్ కే నగర్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించాలని ఈసీ భావిస్తోందని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ దెబ్బతో శశికళ వర్గం ఆందోళనకు గురైయ్యింది.

ఎడప్పాడి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ
ఆర్ కే నగర్ ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంతో తమిళనాడులో అధికారంలో ఉన్న శశికళ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ పడింది. ఇప్పటికే ఆర్ కే నగర్ లో శశికళ వర్గీయులు రూ. 89 కోట్లు పంచిపెట్లారని ఐటీ శాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసింది.

కొంప ముంచేసిన మంత్రి
శశికళకు వీరవిధేయుడిగా ఉన్న తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కొంప ముంచాడని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. గత శుక్రవారం తమిళనాడులోని 32 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో ఆర్ కే నగర్ లో రూ. 89 కోట్లు నగదు పంపిణి చేశారని వెలుగు చూసింది.

మళ్లీ మొదటికి వచ్చింది
శశికళ వర్గం ఆందోళనలో ఉంది. ఆర్ కే నగర్ ఉప ఎన్నిక నగదు పంచిపెట్టారన్న ఆరోపణలు నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు. దినకరన్ పార్టీ పెద్దలతో సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం వలనే ఇంత జరిగిందని శశికళ వర్గీయులు మండిపడుతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications