బ్యాంకులకు రొటోమ్యాక్ పెన్స్ కొఠారి ఎంత బాకీ పడ్డారో తెలుసా?
న్యూఢిల్లీ : బ్యాంకులను మోసం చేసిన కేసులో రొటోమ్యాక్ పెన్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన తనయుడు రాహుల్ కొఠారీలను గురువారం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఫిర్యాదు రావడంతో సీబీఐ ఆదివారం కొఠారి కుటుంబసభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు విచారించిన సీబీఐ మోసం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమవడంతో గురువారం విక్రమ్ కొఠారి, రాహుల్ కొఠారిలను అరెస్ట్ చేసింది. ప్రాథమిక విచారణలో.. కోఠారి కుటుంబ సభ్యులు వివిధ బ్యాంకుల నుంచి రూ.2,919 కోట్లు లోన్ తీసుకున్నారని, దీనికి వడ్డీ రూ.776 కోట్లు అయిందని తేలింది. దీంతో వడ్డీలతో కలిపి వారు రూ.3,695 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.754.77 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (456.63), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (771.07 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (458.95 కోట్లు), అలహాబాద్ బ్యాంక్(రూ.330.68 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(49.82 కోట్లు), ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(97.47 కోట్లు) బకాయిలు పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, భార్య, కొంత మంది బ్యాంకు అధికారులు, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులపై కుట్ర, మోసం, ఫోర్జరీ తదీతర యాక్ట్‌ల కింద సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.












Click it and Unblock the Notifications