వందల కోట్ల లావాదేవీలు!: అవన్నీ ఫేక్ అంటూ పీఎస్‌లో కేంద్రమంత్రి కుమారుడు ప్రతాప్ ఫిర్యాదు
ముంబై: తాను లావాదేవీల విషయమై ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఉన్నవీడియో ఫేక్ అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర ప్రతాప్ సింగ్ తోమర్ (Devendra Pratap Singh Tomar) స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. కాగా, కేంద్రమంత్రి తోమర్ దిమానీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతాప్ సింగ్ లావాదేవీల గురించి చర్చిస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వైరలైన ఆ వీడియోలో ప్రతాప్ సింగ్ తోమర్.. ఓ వ్యక్తితో రూ. వంద కోట్లను తరలించే విషయంపై చర్చిస్తున్నట్లుగా ఉంది. మరో కాల్ రికార్డులో ఆయనకు అందాల్సిన రూ. 18 కోట్లను వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు ఓ వ్యక్తి మాట్లాడారు.
ఈ ఆడియో, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అవి నకిలీవని, తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కొందరు కుట్రపన్ని వాటిని సృష్టించారని ప్రతాప్ సింగ్ తోమర్ అన్నారు. వీటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

'నేను కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించినట్లు ఓ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. నన్ను అపఖ్యాతి చేసేందుకే కుట్రతో కావాలనే కొందరు దాన్ని సృష్టించారు. ప్రజల్లో నాకు ఉన్న పలుకుబడిని, ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే నకిలీ వీడియో క్లిప్‌లను వివిధ సోషల్ మీడియాల్లో ప్రసారం చేస్తున్నారు' అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రతాప్ సింగ్ తోమర్ పేర్కొన్నారు.
తనకు, తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు ఎలాంటి పెద్ద మొత్తాలు అందలేదని ప్రతాప్ సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు, ఆడియోలను సృష్టించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి, తనపై కుట్ర చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. దేవేంద్ర ప్రతాప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, ప్రతాప్ సింగ్ వీడియో వైరల్ కావడంతో ఈ విషయంపై న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఆయన పదవిలో ఉంటే దర్యాప్తు సరైన విధానంలో జరగదని అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications