Reddy: సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్యకు రూ. కోట్లలో డీల్, ఆడియో లీక్, సీఎం ఎంట్రీతో ?
బెంగళూరు/ బోమ్మనహళ్లి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వాతారణం వేడెక్కుతున్నాయి. రాజకీయాల్లో ఉన్న నాయకులు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే మరోసారి ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ ఎమ్మెల్యే, అధికార పార్టీలో మంచి గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే హత్యకు రూ. కోట్లలో డీల్ జరిగిందని ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. ఐటీ హబ్ లో ఫేమస్ రౌడీ అయిన రౌడీషీటర్ ఎమ్మెల్యే హత్యకు రెక్కీకూడా నిర్వహించాడని వెలుగు చూడటం కలకలం రేపింది. మ్యాటర్ సీఎం వరకు వెళ్లింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నేను ఎవరికి భయపడను అంటూ ఎమ్మెల్యే రెడ్డి ధైర్యంగా ఉన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే
కర్ణాటక రాష్ట్ర రాజధాని, ఐటీ హబ్ బెంగళూరులోని బొమ్మనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి హత్యకు స్కెచ్ వేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్యకు రూ. 2 కోట్లు డబ్బు ప్రముఖ రౌడీ షీటర్ కు ఇచ్చారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. సతీస్ రెడ్డి హత్యకు కరుడుగట్టిన రౌడీషీటర్, బెంగళూరులోని విల్సన్ గార్డెన్ కు చెందిన విల్సన్ గార్డెన్ నాగా స్కెచ్ వేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే సతీష్ రెడ్డి గురించి పిన్ టూ పిన్
విల్సన్ గార్డెన్ నాగా రూ. 2 కోట్లకు సుపారీ తీసుకుని సతీష్ రెడ్డి హత్యకు అతనే స్కెచ్ వేశాడని తెలిసింది. విల్సన్ గార్డెన్ నాగ టీమ్ బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని హత్య చెయ్యాలని ప్లాన్ చేశారని తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి రోజువారీ కార్యక్రమాలన్నీ పరిశీలిస్తున్న విల్సన్ గార్డెన్ నాగా టీమ్ ఆయన్ను హత్య చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

ఎమ్మెల్యేకి మ్యాటర్ లీక్ అయ్యింది
అయితే తనను హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని బోమ్మనహళ్లి బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి పసిగట్టడంతో ఆయన రౌడీషీటర్ల స్కెచ్ నుంచి తప్పించుకున్నారు. హత్యకు పథకం పన్నారని తెలిసిన వెంటనే మేల్కొన్న బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ఫోన్ లో మ్యాటర్ లీక్ అయ్యింది
సతీష్ రెడ్డి హత్య ప్లాన్ చేసిన విల్సన్ గార్డెన్ నాగ గ్యాంగ్ నుంచే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. చిత్రదుర్గలో రౌడీ షీటర్ నాగా అనుచరుడు ఆకాష్ నివాసం ఉంటున్నాడు. ఆకాష్ ఫ్రెండ్ చంద్రూ బెంగళూరులోని బోమ్మనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. చంద్రుతో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో విల్సన్ గార్డెన్ నాగా శిష్యుడు ఆకాస్ సతీష్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నామని మ్యాటర్ లీక్ చేశాడు. చంద్రూ, ఆకాష్ మాట్లాడుకుంటున్న ఆడియో టేప్ బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి చేతికి చిక్కడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

కేసు పెట్టిన ఎమ్మెల్యే సతీష్ రెడ్డి
ఆకాష్ ఆడియో, రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగా ఫొటోతో సహ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి తన హత్యకు స్కెచ్ వేశారని కేసు పెట్టారు. ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు విలన్స్ గార్డెన్ నాగా కోసం గాలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో విల్సన్ గార్డెన్ నాగా గ్యాంగ్ బెంగళూరు నుంచి పరారైంది. బొమ్మనహళ్లి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విల్సన్ గార్డెన్ నాగా కోసం గాలిస్తున్నారు.

నేను ఎవడికి భయపడను
ఎమ్మెల్యే సతీష్ రెడ్డి స్వయంగా విధానసౌధాలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో నా హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇలాంటి హత్యా స్కెచ్‌లకు నేను ఎప్పుడు భయపడను, నేను ఏ రాజకీయ పార్టీ నాయకులను నిందించను, నేను ఎవరికీ ద్రోహం చేయలేదు. నాకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అన్నారు. అయితే తన హత్యకు సుపారీ మాట్లాడి నన్ను చంపేయాలని చెప్పిన ఆడియో నా దగ్గర ఉందని సతీష్ రెడ్డి అన్నారు.

సెక్యూరిటీ అవసరం లేదు, రెడ్డి
నేను రాజకీయాలు తప్ప మరే వ్యాపారాలు చెయ్యడం లేదని, ఎవ్వరిని మోసం చెయ్యలేదని, పోలీసులు విచారణ జరిపి దోషులను అరెస్టు చేసి జైలుకు పంపాలని బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నన్ను చంపేందుకు స్కెచ్ వేసిన నిందితులు నన్ను వెంబడిస్తున్నట్లుగా ఉందని అనుమానం వచ్చిందని, నిందితుడి గురించి పోలీసులకు సమాచారం అందిందని ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అన్నారు. తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పోలీసు అధికారులకు సూచించారని, అయితే తనకు ఎలాంటి భయం లేదు కనుక ప్రత్యేక భద్రత అవసరం లేదని సీఎంకు చెప్పానని బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి విధానసౌదలో చెప్పారు. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్యకు స్కెచ్ వేశారని వెలుగు చూడటం బోమ్మనహళ్లి ఏరియాలో కలకలం రేపింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications