Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RRR: దెబ్బతో రికార్డులు బద్దలు, 100 ఎకరాల్లో, రాజమౌళి,ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ కేక, వారం ముందే ఉగాది !

హైదరాబాద్/బెంగళూరు/ చిక్కబళ్లాపురం: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా కోసం తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలోని భారతీయ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో ఈనెల 25వ తేదీ కొన్ని వేల సినిమా థియేటర్లలో విడుదలౌతున్న RRR సినిమా మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తరువాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR భారీ మల్లీస్టారర్ సినిమా కావడంతో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి.

నందమూరి అభిమానులు, మోగా ఫ్యామిలీ అభిమానుల అంచనాలు చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. బెంగళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోచి బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని చిక్కబళ్లాపురం సమీపంలో 100 ఎకరాల్లో RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అభిమానులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు,

 మొదట బెంగళూరు అనుకున్నా ?

మొదట బెంగళూరు అనుకున్నా ?

RRR సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి విషయంలో ఆ సినిమా హాట్ టాపిక్ అవుతోంది. ఇక RRR సినిమా ఫ్రీ రిలీజ్ ఆవెంట్ విషయంలో RRR టీమ్ ఎవ్వరూ ఊహించని విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో జరగవలసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ తరువాత ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల్లోని చిక్కబళ్లాపురం దగ్గరకు వెళ్లిపోయింది. చిక్కబళ్లాపురం, కోలారులో ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ఆలోచించిచారు. చివరికి చిక్కబళ్లాపురంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

 ఆర్ఆర్ఆర్ దెబ్బకు 100 ఎకరాలు

ఆర్ఆర్ఆర్ దెబ్బకు 100 ఎకరాలు

చిక్కబళ్లాపురం సమీపంలోని 100 ఎకరాల్లో RRR ఫ్రీరిలీజ్ ఆవెంట్ కు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన నటీనటులు అందరూ చిక్కబళ్లాపురలో జరుగుతున్న ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈనెల 19వ తేదీన చిక్కబళ్లాపురం ప్రజలకు ముందుగానే ఉగాది పండుగ వచ్చేస్తోంది.

 25 వేల అడుగల ఎల్ ఈడీ స్క్రీన్, 45 లేజర్ లైట్స్ హైలెట్

25 వేల అడుగల ఎల్ ఈడీ స్క్రీన్, 45 లేజర్ లైట్స్ హైలెట్

RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతున్న ప్రాంతంలో 25 వేల చదరపు అడుగుల ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. 45 లేజర్ లైట్స్ తో RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ అదరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు, సాయంత్రం కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందే RRR సినిమాకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు.

 పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఘననివాళి

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఘననివాళి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల అందరిని వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఘనంగా శ్రద్దాంజలి ఘటించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు (మార్చి 17వ తేదీ పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే)కు రెండు రోజుల తరువాత జరుగుతున్న ఆర్ఆర్ఆర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం ఇవ్వాలని RRR టీమ్ నిర్ణయించిందని తెలిసింది.

 సీఎం బోమ్మయ్, శివన్న చీఫ్ గెస్ట్ లు

సీఎం బోమ్మయ్, శివన్న చీఫ్ గెస్ట్ లు

చిక్కబళ్లాపురంలో జరగబోతున్న RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్యఅథితులుగా హాజరౌతున్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్ అన్న), చిక్కబళ్లాపురం శాసన సభ్యుడు, కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ తో పాటు వివిద రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలు RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరౌతున్నారు.

అదిరిపోయే ప్రోగ్రామ్స్

అదిరిపోయే ప్రోగ్రామ్స్

కన్నడలో అనుశ్రీ, అకుల్ బాలాజీ, తెలుగులో సుమా యాంకరింగ్ చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. RRR సినిమా పాటలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమాల్లోని పాటలకు అదిరిపోయే డ్యాన్స్ ప్రోగ్రామ్ప్ ఏర్పాటు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు లక్షల్లో చిక్కబళ్లాపురం చేరుకోవడానికి సిద్దం అవుతున్నారు.

 RRR ఈవెంట్ కు అందరూ ఆహ్వానితులే

RRR ఈవెంట్ కు అందరూ ఆహ్వానితులే

చిక్కబళ్లాపురం సమీపంలో జరుగుతున్న RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు అందరూ ఆహ్వానితులే అని కర్ణాటకలో RRR సినిమాను విడుదల చేస్తున్న వెంకట్ కోణంకి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు, నందమూరి అభిమానులతో పాటు ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరు హాజరుకావడానికి అవకాశం కల్పిస్తున్నామని వెంకట్ కోణంకి మీడియాకు చెప్పారు.

 ఆన్ లైన్ లో RRR పాస్ లు

ఆన్ లైన్ లో RRR పాస్ లు

చిక్కబళ్లాపురం సమీపంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం జరుగుతున్న RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరుకావాలని ఆశపడుతున్న అభిమానులు www.kvnproductions,co,in వెబ్ సైట్ లో పాస్ లు డౌన్ లోడ్ చేసుకోవాలని వెంకట్ కోణింకి మనవి చేశారు. ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకునే పాస్ లకు బార్ కోడ్ కూడా ఉంటుందని వెంకట్ చెప్పారు.

 ఏర్పాట్లు పరిశీలిస్తున్న అభిమాన సంఘాల నాయకులు

ఏర్పాట్లు పరిశీలిస్తున్న అభిమాన సంఘాల నాయకులు

చిక్కబళ్లాపురం సమీపంలో జరుగుతున్న RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ ను విజయవంతం చెయ్యాలని మోగా ఫ్యామిలీ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిక్కబళ్లాపురం సమీపంలోని ఈవెంట్ జరుగుతున్న ప్రాంతంలో జరుగుతున్న పనులను ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమాన సంఘాల నాయకులు పరిశీలిస్తున్నారు.

Recommended Video

    RRR Movie: NTR Craze In Overseas | Man Of Masses NTR | Ram Charan| SS Rajamouli | Oneindia Telugu
     సంతోషంగా రావాలి.... క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, మాణిక్యం

    సంతోషంగా రావాలి.... క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, మాణిక్యం

    ఇద్దరు హీరోల అభిమానులు సురక్షితంగా ఈవెంట్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవాలని, కార్యక్రమం పూర్తి అయిన తరువాత క్షేమంగా వారివారి గమ్యం చేరుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కర్ణాటక కన్వీనర్ మాణిక్యం మనవి చేస్తున్నారు. చిక్కబళ్లాపురంలో ఈవెంట్ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి మాణిక్యంతో పాటు జానియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు అక్కడికి చేరుకుని అక్కడ జరుగుతున్న పనులు గురించి వివరాలు తెలుసుకుని ఇతర ప్రాంతాల్లో ఉన్న అభిమానులకు సమాచారం ఇస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+