షాక్: డాక్టర్ రూంలో రూ. 10 లక్షల రూ. 2,000 నోట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

కోలకత్తా: పెద్ద నోట్ల రద్దు చెయ్యడంతో కొత్త నోట్లు చేతికి రాక సామాన్య ప్రజలు అల్లాడుతుంటే ఓ వైద్యుడు మాత్రం ఏకంగా రూ. 10 లక్షలు తన చాంబర్ లో పెట్టుకోవడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు, పోలీసులు షాక్ కు గురైనారు.

దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన రూ. 10 లక్షల నోట్లతో పాటు రూ. నాలుగు లక్షల విదేశీ కరెన్సీ డాక్టర్ చాంబర్ లో చిక్కిందని పోలీసులు అన్నారు. ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న నగదుకు ఎలాంటి ఆధారాలు లేవని ఈడీ అధికారులు చెప్పారు.

Rs 10 lakh in new notes found in doctor’s chamber in Kolkata

దేశంలో కొత్త నోట్ల కొరత ఎక్కువగా ఉండటంతో ఈడీ అధికారులు దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు చేశారు. కోల్ కత్తాలో ఆరు, పారాదీప్ లో రెండు, గుహవాతిలో రెండు, భువనేశ్వర్ లో రెండు, తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు.

కోల్ కత్తాలోని సాల్ట్ లేక్ లో ఉంటున్న ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర రూ. 10 లక్షల కొత్త నోట్లు (భారత్), రూ. నాలుగు లక్షల విలువైన విదేశీ కరెన్సీ చిక్కిందని పోలీసులు అన్నారు. ఇతని దగ్గర ఇంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు ఉండటంతో కచ్చితంగా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుని ఉంటారని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

కోల్ కత్తా వైద్యుడి మీద పీఎంఎల్ఏ, ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. దేశంలో ఎక్కడైనా పాత నోట్లు (బ్లాక్ మనీ) మార్చి కొత్త నోట్లు తీసుకుంటున్నారా ? అని ఈడీ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ఆరా తీస్తూ సోదాలు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Their value had already cros sed Rs 10 lakh by late evening and counting was still on.
Please Wait while comments are loading...